సునీత తల్లి కాబోతున్నారంటూ వచ్చిన వార్తలకు దండం పెట్టేశారు

Singer Sunitha Reacts About Rumours. ఓ వెబ్ సైట్ లో సింగర్ సునీత తల్లి కాబోతుంది అంటూ రాసిన వార్త ఈరోజు తెగ వైరల్ అయింది

By Medi Samrat  Published on  23 April 2022 8:08 PM IST
సునీత తల్లి కాబోతున్నారంటూ వచ్చిన వార్తలకు దండం పెట్టేశారు

ఓ వెబ్ సైట్ లో సింగర్ సునీత తల్లి కాబోతుంది అంటూ రాసిన వార్త ఈరోజు తెగ వైరల్ అయింది. ఈ ఫొటోకు సునీత స్పందించారు. ఆ న్యూస్ ఆర్టికల్ ను తీసుకొని ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. "దేవుడా.. మనుషులు మరీ ఇంత పిచ్చివాళ్లుగా ఉన్నారు. నేను ఈరోజు మొదటిసారి పండిన మా మామిడి పంటతో ఒక ఫోటో పోస్ట్ చేశాను. కానీ ఇలా వార్తలు రాస్తున్నారు. మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకొని ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఆపండి. దండం రా నాయనా" అంటూ పోస్ట్ చేసి క్లారిటీ ఇచ్చారు సునీత.

ఇంతకూ ఏమైందంటే :

సింగర్ సునీత గత సంవత్సరం రామ్‌ వీరపనేని అనే ప్రముఖ వ్యాపారవేత్తని రెండో వివాహం చేసుకున్నారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఇటీవల సునీత తన పొలంలో, అక్కడ పండిన పంటలతో ఫోటోలు దిగారు. తాజాగా సునీత తన మామిడి తోటలో ఓ మామిడి చెట్టు దగ్గర కూర్చుని మామిడి కాయలను చూపిస్తూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి బ్లెస్డ్‌ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో ఉదయం నుంచి పలు వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్ సునీత మళ్ళీ తల్లి కాబోతుందా? అందుకే మామిడికాయని చూపిస్తూ బ్లెస్సెడ్ అని పోస్ట్ చేసింది అంటూ వార్తలు రాశారు. దీంతో ఈ వార్తలని చూసిన సునీత దండంరా నాయనా అంటూ పోస్టు చేశారు.

Next Story