టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి తేదీ ఫిక్స్‌..!

Singer Sunitha Marriage. టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఎప్పటి నుండో రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు

By Medi Samrat  Published on  26 Dec 2020 2:12 PM IST
టాలీవుడ్ సింగర్ సునీత పెళ్లి తేదీ ఫిక్స్‌..!

టాలీవుడ్ ప్రముఖ సింగర్ సునీత ఎప్పటి నుండో రెండో పెళ్లి చేసుకోబోతుందని వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో పుకార్లు చక్కర్లు కొడుతూ వచ్చాయి. అవి పుకార్లు కాదు నిజమే అని గుర్తుచేస్తూ ఇటీవల తనకు నిశ్చితార్థం జరిగిందని సడన్ షాక్ ఇచ్చింది. అంతేగాక ఆమె ఎంగేజ్‌మెంట్ కి సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రముఖ మీడియా సంస్థ అధినేత రామ్ వీరపనేని ఆమె వివాహాం చేసుకోనుంది. ఆయనతో తన మిగిలిన జీవితాన్ని పంచుకోబోతున్నానని తెలిపింది.

ఇక వీరి వివాహాం డిసెంబ‌ర్ చివ‌రి వారంలో జ‌రుగుతుంద‌ని మొద‌ట వినిపించినా.. జ‌న‌వ‌రికి పోస్ట్ పోన్ చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి. దీంతో ఒక్కొక్కరూ ఒక్కో విధమైన తేదీలతో ప్రచారం చేస్తున్నారు. తొలుత డిసెంబ‌ర్‌ 27న జరిగే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆ తేదీన సునీత, రామ్ ల పేర్లపై ముహుర్తం కుదరలేదని సమాచారం. అయితే.. తాజాగా వీరిద్దరి పెళ్లిపై మరో వార్త బయటకు వచ్చింది. జనవరి 9న సునీత, రామ్‌ వీరపనేని వివాహం జరగనున్నట్లు ఈ వార్త సారాంశం. క‌రోనా నేపథ్యంలో పెళ్లికి కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్వానించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్త‌ల‌పై సునీత కానీ, రామ్ వీర‌ప‌నేని కానీ స్పందించ‌లేదు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సునీత ఈ విష‌య‌మై ఎలా స్పందిస్తారో చూ‌డాలి మ‌రి.


Next Story