శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పుష్ప త‌ర్వాతే వ‌స్తోంది.!

Shyam Singha Roy Release Date. కరోనా కేసులు తగ్గుతూ ఉండడం.. తెలుగు రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్

By Medi Samrat  Published on  18 Oct 2021 11:52 AM IST
శ్యామ్ సింగరాయ్ రిలీజ్ డేట్ ఫిక్స్.. పుష్ప త‌ర్వాతే వ‌స్తోంది.!

కరోనా కేసులు తగ్గుతూ ఉండడం.. తెలుగు రాష్ట్రాల్లో 100 శాతం ఆక్యుపెన్సీతో సినిమా హాళ్లు నడుస్తూ ఉండడంతో పలు సినిమాలు విడుదలకు క్యూ కడుతూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు సినిమాలను బాగా ఆదరిస్తూ ఉండడంతో ఎన్నో సినిమాలు విడుదలకు సిద్ధమవుతూ ఉన్నాయి. దసరాకు మొదలైన సినిమాల సందడి.. వచ్చే సమ్మర్ వరకూ కొనసాగనుంది. మాస్ సినిమాల దగ్గర నుండి.. పాన్ ఇండియా సినిమాల వరకూ సిద్ధమవుతూ ఉన్నాయి. తాజాగా నాని హీరోగా నటిస్తున్న 'శ్యామ్ సింగరాయ్' సినిమా కూడా డిసెంబర్ లో విడుదల కాబోతోంది. తాజాగా రిలీజ్ డేట్ ను చిత్ర బృందం లాక్ చేసింది.

టక్‌ జగదీష్‌ మూవీ తో ఓటీటీలో టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన నాచురల్‌ స్టార్‌ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా ను మాత్రం థియేటర్లలోనే రిలీజ్ చేయిస్తానని మాట ఇచ్చాడు. అనుకున్నట్లుగానే ఈ సినిమాను డిసెంబర్‌ 24న క్రిస్మస్‌ కానుకగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ మేరకు హీరో నాని మరియు హీరోయిన్‌ సాయి పల్లవి కలిసి ఉన్న పోస్టర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాను నాలుగు భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమా రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి మరియు మడోన్నా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఎప్పుడూ చూడని లుక్ లో నాని రెండు పాత్రల్లో సందడి చేయనున్నాడు. ఈ సినిమా కంటే ఒక వారం ముందు అల్లు అర్జున్ నటించిన పుష్ప విడుదల కాబోతోంది. పుష్ప డిసెంబర్ 17న పాన్ ఇండియా రేంజిలో విడుదల కాబోతోంది.


Next Story