నటి హేమకు 'మా' షాక్..!
Show Cause Notice To Actress Hema. నటి హేమ ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు
By Medi Samrat Published on
10 Aug 2021 1:01 PM GMT

నటి హేమ ప్రస్తుత 'మా' అధ్యక్షుడు నరేశ్ నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల హేమ వాయిస్ మెసేజ్ లీక్ కావడంతో మరోసారి 'మా'లో మాటల యుద్ధం మొదలైంది. హేమ ఆరోపణలను 'మా' అధ్యక్షుడు నరేశ్, కార్యదర్శి జీవిత ఖండించారు. బాధ్యతారహితంగా మాట్లాడి 'మా' ప్రతిష్ఠ దిగజారేలా చేసిందని క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు క్లాస్ - 8 బైలాస్ కింద హేమకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.
డీఆర్‌సీకి లేఖ రాసిన నరేష్.. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోపణల నేఫథ్యంలో మూడు రోజుల్లో హేమ నుంచి సమాధానం రావాలని.. అది సంతృప్తికరంగా ఉండాలని డీఆర్‌సీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లేని పక్షంలో క్రమశిక్షణా సంఘం నుంచి కఠిన చర్యలు తప్పవని తెలిపింది. ఇదిలావుంటే.. 'మా' అసోసియేషన్ ఎన్నికలపై చిరంజీవి స్పందించారు. ఈ మేరకు 'మా' క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ కృష్ణంరాజుకు లేఖ రాశారు. వెంటనే మా ఎన్నికలు జరపాలనీ.. లేదంటే.. సభ్యుల ఆరోపణలతో 'మా' ప్రతిష్ట మసకబారుతోందని పేర్కొన్నారు.
Next Story