చనిపోవాలనుకున్నా : సమంత షాకింగ్ కామెంట్స్
Samantha Shocking Comments. సమంత-నాగ చైతన్య డైవర్స్ వ్యవహారంపై ఇప్పటికే తీవ్రమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే..
By Medi Samrat Published on 7 Dec 2021 5:58 PM ISTసమంత-నాగ చైతన్య డైవర్స్ వ్యవహారంపై ఇప్పటికే తీవ్రమైన చర్చ జరిగిన సంగతి తెలిసిందే..! మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని అనుకున్న జంట కాస్తా విడిపోవడం జరిగింది. అయితే డైరెక్ట్ గా సమంత విడాకులపై ఎటువంటి ప్రకటన చేయలేదు. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత తొలిసారి స్పందించింది. విడాకుల ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో తరచూ భావోద్వేగపూరితమైన కోట్స్ షేర్ చేస్తూ ఆవేదనను పంచుకున్న సామ్ తన విడాకుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'నేను విడాకులు తీసుకున్నప్పుడు కుంగిపోయి చనిపోతానని అనుకున్నాను. నేను చాలా బలహీనమైన వ్యక్తినని నా ఫీలింగ్. కానీ నేను ఎంత బలంగా ఉన్నానో తెలిసి ఇప్పుడు ఆశ్చర్యం వేస్తోంది. నేను ఇంత దృఢంగా ఉండగలనని అనుకోలేదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది శామ్.
ఫిల్మ్ ఫేర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ మీరు చెడు రోజులను ఎదుర్కోంటే పర్వాలేదు.. వాటి గురించి అర్థం చేసుకోండి.. ఏదైనా పనిని మధ్యలోనే ఆపివేసే పరిస్థితి వస్తే దానిని అంగీకరించండి. సమస్యలతో పోరాడుతునే ఉండండి.. అది ఎప్పటికీ అంతంలేని ఓ యుద్ధం. ఇది నా సమస్య.. నేను ఇంకా నా జీవితాన్ని గడపాలి.. నాకు తెలుసు నా జీవితాన్ని ఇంకా గడపాల్సి ఉందని.. ప్రస్తుతం నేను వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొంటున్న అన్ని సమస్యలతో పోరాడుతూ.. నేను ఎంత బలంగా ఉన్నానని నేనే ఆశ్చర్యపోతున్నాను అంటూ చెప్పుకొచ్చింది సమంత.