యాబ్స్ రప్పించే పనిలో పడ్డ సమంత
Samantha Ruth Prabhu Shows Off Her Toned Abs. Pic Inside. సమంత.. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఫిట్నెస్ మీద ఎంతగానో శ్రద్ధ చూపిస్తూ ఉంది
By Medi Samrat Published on
23 March 2022 1:05 PM GMT

సమంత.. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండేది. ఇప్పుడు మాత్రం ఫిట్నెస్ మీద ఎంతగానో శ్రద్ధ చూపిస్తూ ఉంది. ఎప్పటికప్పుడు సమంత తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తుంటుంది. తాజాగా కూడా ఆమె తన ఫిట్నెస్ వీడియోను ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంది. సమంత కు నేడు యాబ్స్ డే. జిమ్‌లో నియాన్ గ్రీన్ అథ్లెషర్ ధరించి తెగ కష్టపడుతూ ఉంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక ఫోటోను షేర్ చేసింది.
అందులో ఆమె "ఆబ్స్ డే" అని రాసింది. సమంత ఫిట్‌నెస్ ట్రైనర్ జునైద్ షేక్ వద్ద శిక్షణ తీసుకుంటోంది. అతను తరచుగా సమంత తో కఠినమైన వర్కవుట్‌లు చేయిస్తూ ఉంటాడు. సమంతా రూత్ ప్రభుకు 22 మిలియన్లకు పైగా అనుచరులు ఉన్నారు. ఆమె తరచుగా తన వ్యాయామ వీడియోలను పంచుకుంటుంది. అంతేకాకుండా తన పెంపుడు కుక్కలు హష్, సాషాతో సందడి చేస్తూ ఉంటుంది. ఫిబ్రవరిలో, సమంత రూత్ ప్రభు చిత్ర పరిశ్రమలో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. వర్క్ పరంగా సమంతా రూత్ ప్రభు అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్‌తో అంతర్జాతీయంగా అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంది.
Next Story