తన మీద వచ్చిన తప్పుడు కథనాలపై స్పందించిన సమంత

Samantha Reacts About Rumours. అక్కినేని నాగ చైతన్య-సమంత విడాకుల గురించిన చర్చ సోషల్ మీడియాలో సాగుతూ ఉంది.

By Medi Samrat  Published on  8 Oct 2021 11:09 AM GMT
తన మీద వచ్చిన తప్పుడు కథనాలపై స్పందించిన సమంత

అక్కినేని నాగ చైతన్య-సమంత విడాకుల గురించిన చర్చ సోషల్ మీడియాలో సాగుతూ ఉంది. సమంతదే తప్పు అని కొందరు ఆరోపిస్తూ ఉండగా.. ఇంకొందరేమో చైతూదే తప్పు అంటూ ఆరోపిస్తూ వస్తున్నారు. ఇక సమంతను సోషల్ మీడియాలో తిట్టిన వాళ్లు కూడా ఉన్నారు. తాజాగా సమంత తన మీద వస్తున్న తప్పుడు కథనాలపై స్పందించింది.

''నాపై మీరు చూపిస్తున్న సానుభూతికి కృతజ్ఞతలు. అయితే, కొందరు నన్ను వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ రూమర్స్‌ వ్యాప్తి చేస్తున్నారు. నాకు ఎఫైర్స్‌ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్‌ చేయించుకున్నానని, నేను అవకాశవాదినని అంటున్నారు. విడాకులు తీసుకోవడం అనేది ఎంతో బాధతోకూడుకున్నది. దయచేసిన నన్ను ఒంటరిగా వదిలేయండి. వ్యక్తిగతంగా నాపై దాడి చేయకుండా దయ చూపండి. వాళ్లు చెప్పినట్లు ఏవీ కూడా భవిష్యత్‌లో జరగవని నేను మాటిస్తున్నా'' అని సమంత సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది.

సమంత, నాగచైతన్య `ఏం మాయ చేసావె` చిత్రంతో అయిన పరిచయం స్నేహంగా, ఆ తర్వాత ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో వీరిద్దరు హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయల ప్రకారం పెళ్లి చేసుకున్నారు. కరెక్ట్ గా నాలుగేళ్ల వైవాహిక జీవితం అనంతరం ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాకిచ్చారు.Next Story
Share it