ఆ రూమర్లే నిజమయ్యాయి.. సమంత-నాగచైతన్య విడాకులపై అధికారిక ప్రకటన

Samantha Naga Chaitanya Announced Divorce. సమంత-నాగ చైతన్య విడిపోతున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా వస్తున్న సంగతి

By Medi Samrat  Published on  2 Oct 2021 3:53 PM IST
ఆ రూమర్లే నిజమయ్యాయి.. సమంత-నాగచైతన్య విడాకులపై అధికారిక ప్రకటన

సమంత-నాగ చైతన్య విడిపోతున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే..! అయితే ఈరోజు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ను ఇచ్చేసింది. తామిద్దరం విడిపోవాలని అనుకుంటున్నామని చెబుతూ అధికారికంగా తెలిపింది. నాగ చైతన్య, సమంత 'ఏం మాయ చేశావే' అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ జంట. ఆ సినిమాతోనే ప్రేమలో పడ్డారు. చాలాకాలం ప్రేమలో ఉన్న వీళ్ళిద్దరూ 2017లో వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత కూడా వాళ్లిద్దరు జంటగా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

అయితే గత కొంతకాలంగా మాత్రం వీరిపై విపరీతంగా రూమర్లు పుట్టుకొచ్చాయి. కొంతకాలం క్రితం సమంత తన సోషల్‌మీడియా ఖాతాల్లోంచి 'అక్కినేని' అనే పదాన్ని తొలగించి కేవలం 'ఎస్' అనే అక్షరాన్ని పెట్టుకుంది. దీంతో సమంత, నాగ చైతన్యలు విడాకులు తీసుకుంటున్నారు అంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. ఇక ఇటీవల విడుదల అయిన నాగ చైతన్య సినిమా 'లవ్‌స్టోరి' సినిమా ప్రీ రిలీజ్, సక్సెస్ వేడుకలకు సమంత హాజరు కాకపోవడంతో అనుమానాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు అధికారికంగా సమంత తన సోషల్ మీడియాలో విడిపోతున్నట్లు తెలిపింది.

మా శ్రేయోభిలాషులందరికీ.. చాలా చర్చలు, ఆలోచనల అనంత‌రం సామ్, నేను మా స్వంత మార్గాలు కొనసాగించడానికి భార్యాభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాము. దశాబ్ద కాలానికి పైగా స్నేహాన్ని కలిగి ఉండటం మా అదృష్టం, ఇది మా మధ్య ఒక ప్రత్యేక బంధాన్ని కలిగి ఉంటుందని మా నమ్మకం. ఈ కష్ట సమయంలో మాకు మద్దతు ఇవ్వాలని, మాకు అవసరమైన గోప్యతను అందించాలని మా అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాను మేము అభ్యర్థిస్తున్నాం. మీ మద్దతుకు ధన్యవాదాలు అని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపారు.



Next Story