బాధపెట్టుంటే క్షమించమని కోరిన సమంత..!

Samantha Akkineni apologises for hurting sentiments. సమంత నటించిన 'ది ఫ్యామిలీ మెన్ 2' సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించి

By Medi Samrat
Published on : 25 Aug 2021 4:13 PM IST

బాధపెట్టుంటే క్షమించమని కోరిన సమంత..!

సమంత నటించిన 'ది ఫ్యామిలీ మెన్ 2' సిరీస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీనికి సంబంధించి ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ అవార్డుల్లో బెస్ట్ యాక్ట్రెస్ (వెబ్ సిరీస్) అవార్డుకు కూడా ఎంపికయింది. 'ఫ్యామిలీ మెన్ 2' వెబ్ సిరీస్ లో ఆమె పోషించిన రాజి పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమంత స్పందిస్తూ ఎవరినైనా తాను బాధపెట్టి ఉంటే క్షమించాలని కోరింది. అంతేకాకుండా కొంత కాలం పాటు నటనకు బ్రేక్ ఇవ్వాలనుకుంటున్నానని తెలిపింది.

11 సంవత్సరాల కెరీర్ లో తాను ఎప్పుడూ బ్రేక్ తీసుకోలేదని.. ఇప్పుడు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నానని తెలిపింది. కొంత కాలంగా కొత్త సినిమాలకు సమంత సైన్ చేయడం లేదు. వచ్చే ఏడాదే ఆమె మళ్లీ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సమంత నటించిన 'శాకుంతలం' సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం తమిళ చిత్రం 'కాత్తు వకుల రెండు కాదల్' షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా లాక్ డౌన్ కు ముందు సమంత సైన్ చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తూ ఉండగా.. నయనతార మరో హీరోయిన్ గా నటిస్తోంది.


Next Story