త్వరలో మీ ముందుకు వస్తా.. సాయి ధరమ్ తేజ్ ట్వీట్
Sai Dharam Tej Tweet. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో
By Medi Samrat Published on
3 Oct 2021 1:45 PM GMT

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సెప్టెంబర్ 10న రోడ్డు ప్రమాదంలో గాయపడి అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఆయన కోమాలో ఉన్నారని అంటుండగా.. మరికొందరు ఆయన కోలుకుంటున్నారని అంటున్నారు. ఇప్పటికే ఈ వార్తలపై మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చారు. సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఓ ఇంటర్య్వూలో తేజు ఆరోగ్యంపై స్పందించారు. తాజాగా సాయిధరమ్ తేజ్ ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఓ ట్వీట్ వెలువడింది.
అది ఆసుపత్రి నుండి చేసినట్లు తెలుస్తుండగా.. ఈ నేఫథ్యంలోనే ఆయన కోలుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాపై, రిపబ్లిక్ సినిమాపై మీరు చూపించే ప్రేమ, అభిమానానికి థ్యాంక్స్ చెప్పడమనేది చాలా చిన్న పదం మాత్రమే. త్వరలోనే మీ ముందుకు వస్తాను అంటూ సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు. డన్ అని అర్ధం వచ్చేలా థంబ్ చూపిస్తూ ఓ ఫోటోను షేర్ చేయగా.. ఇప్పటివరకూ సాయిధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్న అభిమానులు.. ఆనందంలో రీట్వీట్లతో హోరెత్తిస్తున్నారు.
Next Story