ఇంటివాడు కాబోతున్న మరో యంగ్ హీరో.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్

RX 100 Karthikeya Secretly Got Engaged. 'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. హీరో పాత్రలకే పరిమితం

By Medi Samrat  Published on  23 Aug 2021 5:52 AM GMT
ఇంటివాడు కాబోతున్న మరో యంగ్ హీరో.. సీక్రెట్ గా ఎంగేజ్మెంట్

'ఆర్‌ఎక్స్ 100' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తికేయ. కేవ‌లం హీరో పాత్రలకే పరిమితం అవ్వకుండా విలక్షణ పాత్రలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు. ఇప్పటికే 'నాని గ్యాంగ్ లీడర్' సినిమాలో విలన్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ.. ఇప్పుడు అజిత్‌ 'వాలిమై' సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా 'రాజా విక్రమార్క' అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే.. ఈ యువ హీరో త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు.


ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అతికొద్ది మంది బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు సైతం ఈ వేడుకకు హాజరయ్యారు. దీన్ని చాలా సీక్రెట్ గా ఉంచాడు కార్తికేయ. ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఓ ఫోటో వైరల్‌ అవుతుంది. పలువురు ప్రముఖులు సహా నెటిజన్లు కార్తికేయకు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్తికేయ పెళ్లాడనున్న అమ్మాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె కార్తి​కేయ కుటుంబానికి దగ్గరి బంధువు అని సమాచారం. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమని తెలుస్తుంది. కార్తికేయ పెళ్లి ఎప్పుడా అని కూడా ఆరా తీస్తున్నారు.


Next Story
Share it