బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్న‌ 'ఆర్ఆర్ఆర్'.. మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు ఎంతంటే..

RRR box office collection Day 1. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన

By Medi Samrat  Published on  26 March 2022 9:46 AM GMT
బాక్సాఫీస్ వద్ద గర్జిస్తున్న‌ ఆర్ఆర్ఆర్.. మొద‌టి రోజు క‌లెక్ష‌న్లు ఎంతంటే..

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం విడుద‌లై విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతుంది. బాలీవుడ్ స్టార్లు అలియా భట్, అజయ్ దేవగణ్ కూడా ఈ చిత్రంలో నటించారు. ఇక సినిమా ప్ర‌ద‌ర్శింప‌బుతున్న థియేట‌ర్ల‌లో అభిమానులు ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు. ఈల‌లు, గోల‌ల‌తో త‌మ అభిమాన హీరోల సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న చిత్రం కావ‌డంతో మొద‌టిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద కలెక్ష‌న్ల సునామీ సృష్టించింది.

ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద గర్జిస్తుందని ట్రేడ్ అనలిస్ట్ మనోబాల విజయబాలన్ ట్వీట్ చేశారు. మొదటి రోజు సినిమా మొత్తం క‌లెక్ష‌న్‌లు రూ. 257.15 కోట్లని ప్ర‌క‌టించారు. మ‌రో ట్రేడ్ అనలిస్ట్ ర‌మేష్ బాలా కూడా ఆర్ఆర్ఆర్ మొద‌టిరోజు క‌లెక్ష‌న్ల‌పై ట్వీట్ చేశారు. నైజాంలో ఆర్ఆర్ఆర్ మొద‌టి రోజు 23.3 కోట్లు కొల్ల‌గొట్టి ఆల్‌టైం రికార్డు సృష్టించింద‌ని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొద‌టి రోజు 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించింద‌ని ట్వీట్‌లో రాసుకొచ్చారు. మ‌రో ట్రేడ్ అనలిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ కూడా క‌లెక్ష‌న్‌ల విష‌య‌మై ట్వీట్ చేశారు. ఆర్ఆర్ఆర్ క‌లెక్ష‌న్‌ల సునామీ సృష్టిస్తుంద‌ని పేర్కొన్నారు.
Next Story
Share it