య‌శ్ 'గ‌జ‌కేస‌రి' టీజ‌ర్ విడుద‌ల.. ఆ డైలాగ్‌కు థియేట‌ర్లో పూన‌కాలే..‌

Rocking Star Yash’s Gajakesari Movie Telugu Teaser. కన్నడ హీరో య‌శ్.. కేజీఎఫ్ చిత్రంతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను

By Medi Samrat  Published on  26 Feb 2021 4:13 PM GMT
య‌శ్ గ‌జ‌కేస‌రి టీజ‌ర్ విడుద‌ల.. ఆ డైలాగ్‌కు థియేట‌ర్లో పూన‌కాలే..‌

కన్నడ హీరో య‌శ్.. కేజీఎఫ్ చిత్రంతో దేశ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు‌‌. తెలుగులో కూడా యశ్‌కు భారీగా అభిమానులు ఉన్నారు. దీంతో య‌శ్‌ న‌టించిన సినిమాలను తెలుగులోకి డ‌బ్ చేసి ఇక్క‌డ విడుద‌ల చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇందులో భాగంగా య‌శ్ క‌న్న‌డ నాట‌ నటించిన 'గ‌జ‌కేస‌రి' చిత్రాన్ని తెలుగులోకి అనువ‌దించారు. ఆ టీజ‌ర్‌ను కొద్దిసేప‌టి క్రితం రిలీజ్ చేసింది చిత్ర‌యూ‌నిట్‌.


టీజ‌ర్‌లో డైలాగ్‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. ప్రాణం పోయినా నన్ను నమ్ముకున్నవారి చేయి వదిలిపెట్టను అంటూ యశ్‌ చెప్పే డైలాగ్‌కు థియేట‌ర్లో ప్రేక్ష‌కుల‌కు ప‌క్కా పూన‌కాలు వ‌స్తాయి. చారిత్రక యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ఎస్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2014 మే 23న విడుద‌లైంది. తెలుగులో మార్చి 5న విడుద‌ల చేయ‌నున్నారు

ఇదిలావుంటే.. 2018లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన‌ కేజీఎఫ్ చిత్రంతో య‌ష్ ఒక్కసారిగా స్టార్‌ హీరో అయ్యాడు. ‌ప్ర‌స్తుతం ఆ సినిమాకి సీక్వెల్‌గా 'కేజీఎఫ్‌-2' తెరకెక్కుతుంది. విడుదలకు ముందే సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. సినిమాను జూలై 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌నున్న నేఫ‌థ్యంలో.. అభిమానులు ఏకంగా ఆ రోజున సెల‌వు దినంగా ప్ర‌క‌టించాలంటూ మోదీకి ఉత్త‌రాలు రాస్తున్నారు.Next Story