షకీలా డబ్బు కోసమే అలాంటి సినిమాలు చేసింది!

Richa Chadda About Shakeela Movies. సినీ ఇండస్ట్రీలో పలు భాషలలో దాదాపు 200 పైగా చిత్రాలలో నటించిన షకీలా

By Medi Samrat  Published on  28 Dec 2020 10:25 AM GMT
షకీలా డబ్బు కోసమే అలాంటి సినిమాలు చేసింది!

సినీ ఇండస్ట్రీలో పలు భాషలలో దాదాపు 200 పైగా చిత్రాలలో నటించిన షకీలా అందరికీ బాగా పరిచయమైన వ్యక్తి అని చెప్పవచ్చు. ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సినీ ఇండస్ట్రీలో మంచి పేరును తెచ్చుకున్న మలయాళ నటి షకీలా జీవితం ఆధారంగా చేసుకొని "షకీలా "అనే సినిమాను తెరకెక్కించిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాలో షకీలా పాత్రలో బాలీవుడ్ బ్యూటీ రిచాచద్దా టైటిల్ రోల్ పోషించారు.

దర్శకుడు ఇంద్రజిత్ లంకేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని క్రిస్మస్ కానుకగా విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.త్వరలో ఈ చిత్రాన్ని తెలుగు వెర్షన్లో కూడా విడుదల చేయడానికి చిత్ర బృందం ఏర్పాట్లను చేస్తోంది. ఈ సందర్భంగా నటి రిచాచద్దా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, మనదేశంలో అందం గురించి ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉంటుందని అందుకోసమే నటి షకీలా కోసం ఈ సినిమాలో కొద్దిగా బరువు పెరిగానని ఆమె తెలిపారు.

షకీలా సినిమా గురించి పలు విషయాలను మాట్లాడుతూ, ఈ సినిమాల్లో నటించడం వల్ల షకీలా గురించి ఏం తెలుసుకున్నారని ప్రశ్నించగా... అందుకు రిచాచద్దా షకీలాకు అడల్ట్ చిత్రాలలో నటించి పెద్ద స్టార్ట్ కావాలనే ఆలోచనలు లేవు. కేవలం వారి కుటుంబ ఆర్థిక ఇబ్బందుల వల్ల డబ్బును సంపాదించుకోవడం కోసమే షకీలా సినిమాలలో నటించిందని ఆమె తెలిపారు. వాళ్ళ అమ్మ ఒక సినీ ఆర్టిస్ట్ కావడంతో షకీలాను కూడా సినిమాల్లోకి రావాలని బలవంతం పెట్టడం వల్ల, ఆర్థికంగా నిలదొక్కుకోవడం కోసం మాత్రమే షకీలా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారని ఈ సందర్భంగా బాలీవుడ్ నటి రిచాచద్దా షకీలా గురించి కొన్ని ఆశక్తికర విషయాలు తెలిపారు.


Next Story