2020లో టాలీవుడ్ కి దూరమైన సినీ సెలబ్రిటీస్ వీరే!
Remembering Tollywood Celebrities who passed away in 2020. 2019 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త ఉత్సాహంతో 2020
By Medi Samrat
2019 సంవత్సరానికి గుడ్ బై చెబుతూ కొత్త ఉత్సాహంతో 2020 సంవత్సరానికి ఎంతో ఘనంగా స్వాగతం పలికారు. అయితే 2020 వ సంవత్సరం చాలామంది జీవితాల్లో ఘోర విషాదాన్ని నింపిందని చెప్పవచ్చు. అతి భయంకరమైన కరోనా మహమ్మారి వ్యాపించడంతో యావత్ ప్రపంచం మొత్తం అల్లకల్లోలం ఏర్పడింది. ఈ వైరస్ వ్యాపించి ఎంతో మంది ప్రాణాలను కోల్పోయారు. కరోనా వైరస్ విజృంభించడంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఈ విధంగా ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటూ మరికొంతమంది తమ ప్రాణాలను వదిలారు. అంతేకాకుండా ఈ ఏడాది పలువురు సినీ సెలబ్రిటీలు సైతం పలు కారణాల చేత మృత్యువాతపడ్డారు 2020 సంవత్సరం ముగుస్తుండటంతో చనిపోయిన సినీ సెలబ్రిటీస్ ను ఒకసారి గుర్తు చేసుకుందాం.
గాన గంధర్వుడు బాలసుబ్రమణ్యం :
తన మధురమైన గానంతో పలు భాషలలో ఎన్నో పాటలు పాడిన గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు 2020 సెప్టెంబర్ 25 న తుది శ్వాస విడిచారు. కరోనా పాజిటివ్ రావడంతో దాదాపు రెండు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ చివరి శ్వాస విడిచారు. బాలు గారు16 భాషల్లో 40 వేల పైగా పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు.
జయప్రకాష్ రెడ్డి:
నటన పై ఎంతో ఆసక్తి ఉండడంతో మొదట రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగించిన జయప్రకాష్ రెడ్డి తర్వాత సినిమాల్లోకి ప్రవేశించి విభిన్న పాత్రలో నటించి అందరిని మెప్పించారు. 2020 సెప్టెంబర్ 8న తీవ్రమైన గుండెపోటు రావడంతో జయ ప్రకాష్ రెడ్డి మరణించారు.
రావి కొండల రావు:
సీనియర్ నటుడైన రావికొండలరావు దాదాపు 600 పైగా చిత్రాల్లో ఎంతో అద్భుతంగా నటించారు. కొంతకాలం పాటు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 2020 జూలై 28న కన్నుమూశారు.
కోసూరి వేణుగోపాల్:
పిల్ల జమిందార్, చలో, విక్రమార్కుడు,మర్యాదరామన్న వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కోసూరు వేణుగోపాల్ తన నటన ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కోసూరు వేణుగోపాల్ కరోనా బారిన పడడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా సెప్టెంబర్ 23న మృతి చెందారు.