స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన రెజీనా..!

Regina Comments On Star Heros. హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకట్టుకునే గ్లామర్ తో హాట్ హీరోయిన్

By Medi Samrat  Published on  26 Feb 2021 1:33 PM GMT
స్టార్ హీరోలపై సంచలన కామెంట్స్ చేసిన రెజీనా..!

హీరోయిన్ రెజీనా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకట్టుకునే గ్లామర్ తో హాట్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది.రీసెంట్ గా ఈ బ్యూటీ నటించిన 'చక్ర' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఆమె లీల అనే విలన్ రోల్ లో కనిపించి మెప్పించింది. ఈ క్యారెక్టర్ తనకు మంచి పేరు తీసుకొచ్చిందని చెబుతోంది రెజీనా.

ప్రస్తుతం రెజీనా.. మెగాస్టార్ నటిస్తోన్న 'ఆచార్య' సినిమాలో ఐటెం సాంగ్ లో కనిపించనుంది. ఇక తెలుగు ఇండస్ట్రీలో 9 ఏళ్ల నుంచి కొనసాగుతున్న కేవలం కుర్ర హీరోలతోనే ఈ అమ్మడు సినిమాలు చేసింది. ఇక ఇటీవల స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ ఎందుకు రావడం లేదనే ప్రశ్నకు ఈ విధంగా జవాబు ఇచ్చింది. దీనికి సమాధానం తనకు కూడా తెలియదని అంటోంది రెజీనా.

మీడియా వారు మాత్రమే కాకుండా.. తన స్నేహితులు, కుటుంబసభ్యలు కూడా ఇదే అడుగుతుంటారని చెప్పిన ఆమె.. స్టార్ హీరోల సరసన ఎందుకు ఆఫర్లు రావడం లేదో తనకు కూడా అర్ధం కావడం లేదని స్పష్టం చేసింది. ఒకప్పుడు ఈ విషయంలో చాలా బాధపడేదాన్ని అని చెప్పిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం ఓటీటీ రాకతో తనకు ఆ బాధ లేదని అంటోంది. అంతేకాకుండా.. సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ లో కనిపించే ఛాన్స్ లు వస్తుండడంతో.. స్టార్ హీరోల కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటోంది. ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు బిగ్ స్టార్స్ తో నటించే అవకాశాలు రావడం లేదని.. అలాంటప్పుడు తననే ఎందుకు ప్రశ్నిస్తున్నారని అడుగుతోంది ఈ హాట్ బ్యూటీ.


Next Story
Share it