సౌందర్య బయోపిక్.. రెడీ అంటున్న రష్మిక

Rashmika Ready To Act In Soundarya Biopic. సౌంద‌ర్య‌.. ఈ పేరును తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మరచిపోరు.. మరచిపోలేరు..!

By Medi Samrat  Published on  16 Sept 2021 6:04 PM IST
సౌందర్య బయోపిక్.. రెడీ అంటున్న రష్మిక

సౌంద‌ర్య‌.. ఈ పేరును తెలుగు సినీ అభిమానులు ఎప్పటికీ మరచిపోరు.. మరచిపోలేరు..! కర్ణాటకలో పుట్టిన సౌందర్య తెలుగు ప్రజల గుండెల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సొంతం చేసుకుంది. చాలా చిన్న వయసులోనే మరణించిన సౌంద‌ర్య ఎందరికో తీర‌ని శోకాన్ని మిగిల్చింది. ఆమె బ‌యోపిక్ గురించి ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో కర్ణాటకకు చెందిన ర‌ష్మిక‌ సౌందర్య బయోపిక్ కు సంబంధించి తన ఇష్టాన్ని బయటపెట్టింది. ను మీరు బ‌యోపిక్‌లో చేయాల్సి వ‌స్తే ఎవ‌రి పాత్ర‌లో న‌టిస్తారు అని ప్ర‌శ్నించ‌గా, ఆమె దివంగత నటి సౌందర్య పేరు చెప్పింది. సౌందర్యనే ఎంచుకోవడానికి కారణం ఉందని రష్మిక తెలిపింది. నేను సినిమాల్లోకి రాకముందు మా నాన్న ఒక మాట అనేవారు.. నేను సౌందర్య గారిలా ఉంటానని.. తరచుగా నాతో ఆ మాట అనేవారు. ఇక సౌందర్య నటన, సినిమాలు అంటే కూడా నాకు ఇష్టం. అందుకే నాకు సౌంద‌ర్య బ‌యోపిక్‌లో న‌టించాల‌ని ఉంది అని తెలిపింది.

రష్మిక, మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ప్ర‌స్తుతం ర‌ష్మిక పుష్ప సినిమాతో పాటు ప‌లు తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల‌కు సంబంధించిన సినిమాల‌లో న‌టిస్తుంది. రష్మిక ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు, అమితాబ్ బచ్చన్ గుడ్‌బాయ్ చిత్రాలలో నటిస్తోంది. ఈ చిత్రాలతో పాటు ఈ కూర్గ్ బ్యూటీ మిషన్ మజ్ను అనే హిందీ సినిమాలోను నటిస్తుంది.


Next Story