ట్రెండ్ అవుతున్న రష్మిక మందన.. కార‌ణం లేకుండానే..

Rashmika Name Became Trending at least Once per Day. రోజుకు ఒకసారి అయినా రష్మికా పేరు ట్విట్టర్ ట్రెండ్స్ లో నిలుస్తుండడం గమనార్హం.

By Medi Samrat
Published on : 3 March 2021 6:23 PM IST

Rashmika Name Became Trending at least Once per Day

ఛలో చిత్రంతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది కన్నడ బ్యూటీ రష్మిక మందన. మొదటి చిత్రంతోనే మంచి హిట్ అందుకున్న ఈ అమ్మడిని తర్వాత వరుసగా అదృష్టం పలుకరించింది. తర్వాత విజయ్ దేవరకొండతో నటించిన గీతాగోవిందం చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకుంది. అప్పటి నుంచి వరుస విజయాలు తన ఖాతాలో వేసుకుంటూ పోతుంది.

కన్నడ నాటనేకాదు.. తెలుగు టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఇంకా ఈ హాట్ హీరోయిన్ రష్మికా మందన్నా టాలీవుడ్ లోనే కాకుండా ఇండియా లోనే మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా నిలుస్తుంది. తక్కువ సినిమాలే చేసిన సక్సెస్ రేట్ మాత్రం ఈ బ్యూటీకి గట్టిగానే ఉంది. ఒకటి రెండు సినిమాలు మినహా మిగతా అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురిపించినవే.. దీనితో మోస్ట్ లక్కీయేస్ట్ హీరోయిన్ గా పేరొందిన ఈమె పేరు సోషల్ మీడియాలో మాత్రం గత మూడు రోజులుగా పెద్దగా ఎలాంటి కారణం లేకుండానే జాతీయ స్థాయిలో ట్రెండ్ అవుతూ వస్తుంది.

రోజుకు ఒకసారి అయినా రష్మికా పేరు ట్విట్టర్ ట్రెండ్స్ లో నిలుస్తుండడం గమనార్హం. ఆ మధ్య గూగుల్ లో నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియాగా కూడా ప్రకటించబడింది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు రష్మిక క్రేజ్ ఎలాంటిదో.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పుష్ప సినిమాలో నటిస్తుంది. అలాగే బాలీవుడ్ లోను ఒక మూవీ చేస్తుంది.


Next Story