నీకింకా బుద్ధి రాలేదా..? సుమంత్ రెండో పెళ్లి వార్త‌ల‌పై వ‌ర్మ కామెంట్లు.!

Ram Gopal Varma Comments On Sumanth Second Marriage. టాలీవుడ్ హీరో సుమంత్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు

By Medi Samrat  Published on  28 July 2021 8:32 PM IST
నీకింకా బుద్ధి రాలేదా..? సుమంత్ రెండో పెళ్లి వార్త‌ల‌పై వ‌ర్మ కామెంట్లు.!

టాలీవుడ్ హీరో సుమంత్ త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ మేర‌కు సుమంత్‌, పవిత్ర పేర్ల‌తో ఓ కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇప్పటికే పెళ్లి కార్డులు పంచడం కూడా ప్రారంభమయిందని వార్త క‌థ‌నాలు వ‌స్తున్నాయి. అంత‌కుముందు సుమంత్‌ 2004లో హీరోయిన్‌ కీర్తిరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఈ నేఫ‌థ్యంలో సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడ‌నే వార్త ఇండ‌స్ట్రీలో హాట్ టాఫిక్ గా మారింది.

అయితే.. సుమత్ మళ్లీ పెళ్లి చేసుకోనుండటంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. 'ఒక సారి అయ్యాక కూడా నీకింకా బుద్ధి రాలేదా సుమంత్? నీ ఖర్మ, ఆ పవిత్ర ఖర్మ.. అనుభవించండి' అని ట్వీట్ చేశాడు. మ‌రో ట్వీట్‌లో 'ఒక పెళ్లే నూరెళ్ల పెంట‌యితే.. రెండో పెళ్లంట‌య్యా సామీ.. నా మాట విని మానేయ్యి.. ప‌విత్ర గారూ.. మీ జీవితాల‌ను పాడు చేసుకోకండి.. త‌ప్పు మీది.. సుమంత్‌ది కాదు. త‌ప్పు ఆ దౌర్భాగ్య‌పు వ్య‌వ‌స్థ‌ది' అని రాసుకొచ్చారు. ఇదిలావుంటే.. సుమంత్ పెళ్లిపై అఫీషియ‌ల్ అనౌస్స్‌మెంట్ రావాల్సివుంది.


Next Story