డైరెక్టర్ శంకర్ కు ఈ చిక్కులు ఏంటో.. రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడో..?

Ram Charan, Shankar’s film could be delayed. డైరెక్టర్ శంకర్.. దక్షిణాది దర్శకుడైనా ఆయనకు దేశ వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది.

By Medi Samrat  Published on  16 May 2021 4:34 PM GMT
డైరెక్టర్ శంకర్ కు ఈ చిక్కులు ఏంటో.. రామ్ చరణ్ తో సినిమా ఎప్పుడో..?

డైరెక్టర్ శంకర్.. దక్షిణాది దర్శకుడైనా ఆయనకు దేశ వ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి కంటే ముందే పాన్ ఇండియా సినిమాలు తీసిన ఘనుడు శంకర్. కానీ ఇటీవలి కాలంలో ఆయన్ను వివాదాలు వెంటాడుతూ ఉన్నాయి. ముఖ్యంగా 'ఇండియన్-2' సినిమా విషయంలో డైరెక్టర్ శంకర్ కు ఉన్న మంచి పేరు మొత్తం పోయింది. శంకర్ ఏదైనా సినిమాను ఒప్పుకుంటే దానిని పూర్తీ చేశాకనే వేరే సినిమా చేయడం ఆయన నైజం. గతంలో ఎన్నో సినిమాల విషయంలో ఇదే నిరూపితమైంది. కానీ ఈ మధ్య ఆయన కమల్ హాసన్ తో చేస్తున్న 'ఇండియన్-2' సినిమాను పూర్తీ చేయకుండానే రెండు సినిమాలను చేయడానికి డిసైడ్ అయ్యారు. ఒకటి రామ్ చరణ్ తో సినిమా కాగా.. మరొకటి బాలీవుడ్ లో 'రణవీర్ సింగ్' తో అపరిచితుడు సీక్వెల్. అయితే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కేలా కనిపించడం లేదు.

ఎందుకంటే ఇండియన్-2 సినిమాను నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్ సంస్థ తమ సినిమాను పూర్తీ చేయాల్సిందేనని కోరుతూ ఉన్నాయి. శంకర్ మాత్రం ఆ సినిమాను పూర్తీ చేయడానికి పూనుకోవడం లేదనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. 2018లో చిత్రీకరణ ప్రారంభమైన ఇండియన్-2 చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. లైకా సంస్థ కోర్టును ఆశ్రయించింది. చిత్రం షూటింగ్‌ ఆలస్యానికి లైకా సంస్థనేనని దర్శకుడు శంకర్‌ కూడా కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కేసు విచారణలో ఉంది లైకా సంస్థ తమ చిత్రాన్ని పూర్తి చేయకుండా దర్శకుడు శంకర్‌ ఇతర భాషల్లో సినిమాలను చేస్తూ ఉండడాన్ని తప్పుబడుతూ ఉంది. తమ సినిమా పూర్తీ అవ్వకుండా శంకర్ వేరే సినిమాలు చేయకూడదని తెలుగు ఫిలిం ఛాంబర్‌కు, హిందీ ఫిలిం ఛాంబర్‌కు కూడా లేఖలు రాసింది. ఒకానొక సమయంలో వరుస హిట్స్ అందుకున్న శంకర్ కు ఈ చిక్కులు ఏంటో..? రామ్ చరణ్, రణ వీర్ లతో సినిమాలు ఎప్పుడు మొదలవుతాయోనని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. తెలుగులో రామ్ చరణ్ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉన్నారు.
Next Story