ఆర్ఆర్ఆర్ తరువాత చరణ్ ఎలాంటి సినిమా చెయ్యబోతున్నాడు?
Ram Charan Next Movie After RRR. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ‘ఆర్.ఆర్.ఆర్’
By Medi Samrat
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం చేస్తున్నాడు.. ఆ తరవాత ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అనే విషయం పై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.ఇప్పటికే చాలా మంది దర్శకులు చరణ్ ను కలిసి కథలు వినిపించారు. కానీ అతను ఇంకా ఏ డెసిషన్ తీసుకోలేదు. దానికి ఓ కారణం కూడా ఉంది. ఓ రకంగా చరణ్ ఇప్పుడు చేస్తుంది నేషనల్ ప్రాజెక్టు లాంటిది. 'బాహుబలికి' దర్శకుడు తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం కోసం దేశ విదేశాల్లోని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కాబట్టి చరణ్ మార్కెట్ కచ్చితంగా రెండింతలు పెరిగే అవకాశం ఉంటుంది.
దాని తరువాత చరణ్ నటించే సినిమా పై కూడా చాలా అంచనాలు ఉంటాయి. కాబట్టి.. ఆచి తూచి అడుగు వెయ్యాలి. రాజమౌళి తో సినిమా చేసిన ఏ హీరోకి అయినా తరువాత సినిమా ప్లాప్ పడుతుంది. ఈ నేపథ్యంలో ఫలితంతో సంబంధం లేకుండా ఓ మంచి సినిమా చెయ్యాలని చరణ్ భావిస్తున్నాడట. కమర్షియల్ సినిమా చేస్తే కనుక అంచనాలను అందుకోవడం కష్టం. పైగా 'వినయ విధేయ రామ' చిత్రం లాంటి అనుభవం ఉండనే ఉంది. అందుకే 'మగధీర' స్ట్రాటజీనే చరణ్ అప్లై చేయనున్నాడని తెలుస్తుంది. 'మగధీర' వంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న తరువాత.. 'ఆరెంజ్' అనే లవ్ స్టోరీని చేసాడు చరణ్.
ఆ సినిమా ప్లాప్ అయినా కాని .. చరణ్ డెసిషన్ మంచిదే అని ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఆ సినిమాకి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు.ఇప్పటికి ఆ సినిమా సాంగ్స్ శ్రోతులని ఆకట్టుకుంటాయి. దాంతో ఇప్పుడు కూడా చరణ్ 'ఆర్.ఆర్.ఆర్' తరువాత 'జెర్సీ' దర్శకుడితో ఓ డిఫరెంట్ మూవీ చెయ్యాలని డిసైడ్ అయ్యాడట. ఈలోపు గౌతమ్ తిన్ననూరి కనుక 'జెర్సీ' హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో కనుక హిట్ కొడితే.. చరణ్ తో గౌతమ్ చెయ్యబోయే ప్రాజెక్టు పై మంచి హైప్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తెలుస్తుంది.