పవన్ తో సినిమాపై రాజమౌళి హాట్ కామెంట్స్

Rajamouli About Pawan Kalyan. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన పెద్ద దర్శకులతో పని చేయకున్నా కూడా ఆయన స్టార్డమ్

By Medi Samrat
Published on : 31 Oct 2021 2:28 PM IST

పవన్ తో సినిమాపై రాజమౌళి హాట్ కామెంట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఆయన పెద్ద దర్శకులతో పని చేయకున్నా కూడా ఆయన స్టార్డమ్ ఆకాశాన్ని తాకింది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దర్శకత్వంలో పని చేసిన హీరోలు సూపర్ హీరోలు అయ్యారు. ఇక రాజమౌళి పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు వస్తుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండగా.. తాజాగా రాజమౌళి తనకు పవన్ కళ్యాణ్ కు మధ్య చోటు చేసుకున్న సంఘటనల గురించి చెప్పుకొచ్చారు.

బాహుబలి తర్వాత రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' సినిమాను చేస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఇటీవల రాజమౌళి పవన్ కళ్యాణ్ తో సినిమా తాను చేయాలని అనుకున్నానని తెలిపారు. పవన్ కళ్యాణ్ తో సినిమా విషయంలో కొన్నేళ్ల కితం ఆయనకు కథ చెప్పడం జరిగింది అని అయితే అన్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ మళ్ళీ చెప్తాను అని అన్నారని రాజమౌళి తెలిపారు. కానీ తర్వాత ఎటువంటి కాల్ రాకపోవడం తమ ఇద్దరు దారులు కూడా వేరైపోవడం జరిగిందని తెలిపారు.

ఆర్ఆర్ఆర్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ ఆలియా భ‌ట్‌, అజ‌య్ దేవ‌గ‌ణ్, హాలీవుడ్ నటులు ఒలివియా మోరిస్‌, రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి త‌దిత‌రులు ఉన్నారు. ప్ర‌భాస్‌, రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌.. ఈ ముగ్గురితో మీరు ప‌నిచేశారు. మీ దృష్టిలో మీరు ఎవ‌రికి ఓటేస్తారు? అనే ప్రశ్న రాజమౌళికి ఎదురైంది. దానికి రాజ‌మౌళి సినిమా గురించి, యాక్టింగ్ గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎన్టీఆర్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. జంతువుల గురించి తెలుసుకోవ‌డానికి గంట‌ల స‌మ‌యం వెచ్చిస్తాను. వాటి గురించి మాట్లాడాలంటే రామ్‌చ‌ర‌ణ్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టానికి ఇష్ట‌ప‌డ‌తాను. అలాగే పుడ్ గురించి మాట్లాడాలంటే ప్ర‌భాస్‌తో టైమ్ స్పెండ్ చేస్తాను'' అని అన్నారు రాజ‌మౌళి.


Next Story