తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని అంటున్న రాశీ
Raashii Khanna slams false reports on badmouthing South films. రాశీ ఖన్నా ఇటీవలే సౌత్ సినిమాలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందనే వార్తలు వచ్చాయి.
By Medi Samrat Published on 6 April 2022 11:01 AM GMT
రాశీ ఖన్నా ఇటీవలే సౌత్ సినిమాలపై కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందనే వార్తలు వచ్చాయి. తన హిందీ వెబ్ సిరీస్ రుద్రను ప్రమోట్ చేస్తూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి రాశి ఖన్నా చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు విమర్శలు గుప్పించారు. సౌత్ ఇండస్ట్రీలో మహిళలను సెక్సిస్ట్‌గా , మిల్కీ వంటి పేర్లతో పిలుస్తారని, కేవలం గ్లామర్ ముఖాలుగా భావిస్తారని రాశీ ఖన్నా వ్యాఖ్యలు చేసినట్లు కథనాలు ప్రసారం చేశాయి కొన్ని మీడియా సంస్థలు. అయితే అవన్నీ కల్పితమని, అన్ని భాషలకు- చిత్రాలకు గౌరవం ఇస్తానని రాశీ ఖన్నా తెలిపింది.
రాశి ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో తనపై వచ్చిన తప్పుడు నివేదికలను తోసిపుచ్చుతూ ఒక ప్రకటనను చేసింది. "నా గురించి చెడుగా ప్రచారం చేస్తూ.. దక్షిణాది చిత్రాల గురించి కొన్ని కల్పిత, తప్పుగా అర్థం చేసుకున్న విషయాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎవరు చేసినా ఆపివేయమని నేను అభ్యర్థిస్తున్నాను. నేను చేసే ప్రతి భాష/చిత్రం పట్ల నాకు చాలా గౌరవం ఉంది." అని రాశీ తెలిపింది.
సౌత్ ఇండస్ట్రీపై రాశి చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు ప్రేక్షకులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన థ్యాంక్ యు చిత్రంలో నాగ చైతన్యతో రాశి ఖన్నా స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనుంది. అవికా గోర్, మాళవిక నాయర్ కూడా ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు. గోపీచంద్‌తో కలిసి మారుతీ తీస్తున్న పక్కా కమర్షియల్‌లో కూడా రాశీ కనిపించనుంది.