విషాదంలో టాలీవుడ్‌.. యువ నిర్మాత కన్నుమూత

Producer Sandeep Koratala Passed Away. టాలీవుడ్‌లో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. యువ నిర్మాత గుండెపోటుతో కన్నుమూయడం

By Medi Samrat  Published on  1 March 2021 9:08 AM IST
Producer Sandeep Koratala Passed Away

టాలీవుడ్‌లో వరుస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. యువ నిర్మాత గుండెపోటుతో కన్నుమూయడం సినీ ఇండ‌స్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాత సందీప్ కొరిటాల గుండెపోటుతో మరణించాడు. సందీప్.. సుధీర్ వర్మ దర్శకత్వంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా వచ్చిన 'స్వామిరారాస‌, లిరిక్ రైట‌ర్‌ కృష్ణ చైతన్య దర్శకత్వంలో నారా రోహిత్ హీరోగా వచ్చిన 'రౌడీ ఫెలో' సినిమాలకు సందీప్ కొరిటాల సహ నిర్మాతగా వ్యవహరించారు.

స్వామిరారా చిత్రం నిఖిల్ సినిమాల‌లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక‌ రౌడీ ఫెలో సినిమాకు విమ‌ర్శ‌కుల‌ ప్రశంసలు వచ్చాయి. సందీప్ మ‌ర‌ణ‌వార్త విన్న‌ ఈ రెండు సినిమాలకు పని చేసిన నటీనటులు, టెక్నికల్ విభాగం సంతాపం వ్యక్తం చేశారు. ఈయన మరణ వార్త తెలుసుకొని హీరో నారా రోహిత్, దర్శకుడు సుధీర్ వర్మ సంతాపం తెలియజేసారు.

హీరో నారా రోహిత్ కూడా సందీప్‌ గురించి ట్వీట్ చేశాడు. 'నా రౌడీ ఫెలో సినిమా సహ నిర్మాత, నా శ్రేయోభిలాషి సందీప్ కొరిటాల ఇకలేరనే వార్త విని చాలా బాధపడ్డాను. ఈ రోజు ఇంత బాధాకరంగా ప్రారంభమవుతుందని అనుకోలేదు. ఓం శాంతి' అని నారా రోహిత్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు.


దర్శకుడు సుధీర్ వర్మ.. సందీప్‌ ఎంతో అద్భుతమైన వ్యక్తి.. సున్నితమైన హృదయం కలిగిన సందీప్ ఇంకా అర్ధాంతరంగా మన మధ్య నుంచి వెళ్ళిపోతావు అని అనుకోలేదు అంటూ ఎమోషనల్ అయ్యాడు.






Next Story