టాలీవుడ్‌లో తీవ్ర‌ విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత‌, పీఆర్వో బీఏ రాజు క‌న్నుమూత

Producer BA Raju Passes Away. టాలీవుడ్‌లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో

By Medi Samrat  Published on  22 May 2021 2:00 AM GMT
టాలీవుడ్‌లో తీవ్ర‌ విషాదం.. ప్ర‌ముఖ నిర్మాత‌, పీఆర్వో బీఏ రాజు క‌న్నుమూత

టాలీవుడ్‌లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత బీఏ రాజు గుండెపోటుతో మ‌ర‌ణించారు. గతకొద్ది రోజులుగా అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌ శ్రీన‌గ‌ర్ కాల‌నీలోని ఆయ‌న స్వ‌గృహంలో కన్నుమూశారు. గ‌త‌ నాలుగు దశాబ్ధాలుగా ఆయ‌న‌ తెలుగు సినీ రంగంలో రాణిస్తున్నారు. నిర్మాత‌గా, పీఆర్వోగా ఎన్నో చిత్రాల‌కు ప‌నిచేశారు. రాజు మ‌ర‌ణ‌వార్త‌ను ఆయ‌న కుమారుడు, ద‌ర్శ‌కుడు శివ‌కుమార్ ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశారు.

బీఏ రాజు స‌తీమ‌ణి జయ కూడా తెలుగు సినీ అభిమానుల‌కు సుప‌రిచితురాలే. ఆమె కూడా రెండేళ్ల క్రితం క‌న్నుమూశారు. ఆమె ప్రేమలో పావని కళ్యాణ్‌, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్‌లీ, వైశాఖం వంటి సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా.. అందులో కొన్ని చిత్రాల‌కు బీఏ రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. బీఏ రాజు సినీ ప‌త్రిక ఇండ‌స్ట్రీ సూపర్‌హిట్ ద్వారా మంచిపేరు తెచ్చుకున్నారు. టాలీవుడ్‌లోని ప్ర‌ముఖులంద‌రికి త‌ల‌లో నాలుక‌లా ఉండే రాజు మ‌ర‌ణంతో సినీ ప‌రిశ్ర‌మ‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రాజు మ‌ర‌ణ‌వార్త తెలిసిన ప్ర‌ముఖులు ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టించారు.


Next Story