పుష్ప.. శాంపుల్ మాత్రమే.. అసలు రచ్చ ముందుంది..!
Prelude Of Pushpa Movie. అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'పుష్ప' మీద అంచనాలు
By Medi Samrat Published on 3 April 2021 1:48 PM ISTఅల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'పుష్ప' మీద అంచనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా విడుదల అవుతూ ఉండడంతో సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తూ ఉన్నారు. పాన్ ఇండియా రేంజి సినిమా కావడంతో అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ పాన్ ఇండియన్ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని – వై. రవి శంకర్ నిర్మిస్తున్నారు. ముత్యం శెట్టి మీడియా వారు నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు. తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో ఆగస్టు 13న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక బన్నీ సరసన నటిస్తోంది. ఈ సినిమాలో బన్నీ లారీ క్లీనర్ పాత్రలో నటించనున్నాడని అంటున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌లో బన్నీ లుక్ ఆకట్టుకుంటోంది.
ఈ సినిమా అప్డేట్స్ కోసం బన్నీ అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఈ వారామంతా సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తామని చిత్ర బృందం తెలిపింది. తాజాగా ఓ వీడియోను వదిలారు. అడవిలో చేతులు కట్టేసి ముఖం పై ముసుగుతో బన్నీ పరిగెడుతున్న సన్నివేశాన్ని గ్లిమ్ప్స్ రూపంలో వదిలారు మేకర్స్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది. ఏప్రిల్ 7న 6 : 12 నిమిషాలకు దీనికి సంబంధించి ఓ వీడియోను విడుదల చేయనున్నారు.
Hold your nerve tight because Excitement is in the air 😎https://t.co/qGampGGygW
— Mythri Movie Makers (@MythriOfficial) April 3, 2021
Meet the ferocious #PushpaRaj on 7th April at 6:12 PM 🔥@alluarjun @iamRashmika @aryasukku @ThisIsDSP @adityamusic @PushpaMovie #Pushpa
పుష్ప പുഷ്പ புஷ்பா ಪುಷ್ಪ पुष्पा