ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే వార్త.!
Pre Teaser of Radhe Shyam. టాలీవుడ్ లో ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా వెండి తెరకు పరిచయం అయిన యంగ్ రెబల్ స్టార్
By Medi Samrat Published on 6 Feb 2021 9:55 AM ISTఈ మూవీ పూర్వ జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. ఇందులో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో కనిపించనుండగా, పూజా హెగ్డే ప్రేరణ అనే పాత్రతో సందడి చేయనుంది. ఇప్పటికే వీరిద్దరి పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల కాగా, ఇవి ఫ్యాన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు.
అయితే వారికి తీపి కబురు అందిందనే చెప్పాలి. ఇవాళ రాధేశ్యామ్ మూవీ నుంచి అప్డేట్ వచ్చేసింది. ప్రేమకు విట్‌నెస్‌గా వాలంటైన్స్ డే ఉంటుందని తెలియజేస్తూ ఆ రోజు మూవీకి సంబంధించిన టీజర్ విడుదల కానున్నట్టు హింట్ ఇచ్చారు. స్టిన్ ప్రభాకరణ్ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆయన స్వరపరచిన బాణీలు ప్రేక్షకులకు థ్రిల్ కలిగిస్తున్నాయి. "మీకు తెలిసిన మనిషి ఇతడు.. ఈ సారి అతడి హృదయాన్ని తెలుసుకుందాం" అంటూ రెబల్‌స్టార్ నడిచివస్తోన్న వీడియోని రిలీజ్ చేసింది. ఈ చిత్ర షూటింగ్ ఎక్కువ భాగం ఇటలీలోనే జరుపుకున్న సంగతి తెలిసిందే.