ప్రకాష్ రాజ్ సర్జరీ సక్సెస్

Prakash Raj Surgery Success. దేశం గర్వించదగ్గ నటుల్లో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. భాషలతో తేడా లేకుండా ఆయన

By Medi Samrat  Published on  11 Aug 2021 8:32 PM IST
ప్రకాష్ రాజ్ సర్జరీ సక్సెస్

దేశం గర్వించదగ్గ నటుల్లో ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. భాషలతో తేడా లేకుండా ఆయన నటిస్తూనే ఉన్నారు. ఇటీవలే ప్రకాశ్ రాజ్ గాయపడిన సంగతి తెలిసిందే. తమిళ షూటింగ్ సందర్భంగా ఫ్లోర్ పై ఆయన జారిపడడంతో గాయాలు అయ్యాయి. తనకు చిన్న ఫ్రాక్చర్ అయిందని, హైదరాబాదులోని డాక్టర్ గురువారెడ్డితో సర్జరీ చేయించుకునేందుకు వస్తున్నానని చెప్పారు. తాజాగా ఆసుపత్రి బెడ్ మీద నుంచి ట్విట్టర్ లో ఓ పోస్టు పెట్టారు.

ఆసుపత్రి బెడ్ మీద నవ్వులు చిందిస్తున్న ఫొటోను షేర్ చేశారు. సర్జరీ విజయవంతమయిందని ఆయన చెప్పారు. తనకు సర్జరీ చేసిన డాక్టర్ గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు చెపుతున్నానని.. త్వరలోనే మళ్లీ యాక్షన్ లోకి వస్తానని చెప్పారు. 'ది డెవిల్ ఈజ్ బ్యాక్' అని ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ కోలుకున్నందుకు ఆయన అభిమానులు ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు.

మా అసోషియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు ప్రకాష్ రాజ్. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ కృష్ణవంశీ తెరకెక్కిస్తున్న రంగమార్తాండ చిత్రంలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ కాంబోలో రూపొందుతున్న లైగర్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న కేజీఎఫ్-2 లో కూడా కీలక పాత్ర చేస్తున్నారు.




Next Story