షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ‌ ప్రకాశ్‌రాజ్‌

Prakash Raj Injured In Shooting. నటుడు ప్రకాశ్‌రాజ్ షూటింగ్‌లో గాయపడ్డారు. తమిళ హీరో ధనుష్‌ నటిస్తున్న ఓ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌

By Medi Samrat  Published on  10 Aug 2021 4:10 PM IST
షూటింగ్‌లో గాయ‌ప‌డ్డ‌ ప్రకాశ్‌రాజ్‌

నటుడు ప్రకాశ్‌రాజ్ షూటింగ్‌లో గాయపడ్డారు. తమిళ హీరో ధనుష్‌ నటిస్తున్న ఓ చిత్రంలో ప్రకాశ్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చెన్నైలో షూటింగ్‌ జరుపుకుంటోంది. కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుండగా.. ప్రకాశ్‌రాజ్‌ ప్రమాదానికి గురయ్యారు. చేతితోపాటు పలు చోట్ల స్వల్ప గాయాలయ్యాయని సినీ వర్గాల సమాచారం. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌ సన్‌షైన్‌ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరగనుంది.

ప్రస్తుతం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కి పయనమవుతున్నారు. ''చిన్న ఫ్రాక్చర్‌ జరిగింది. నేను బాగానే ఉన్నాను. చింతించాల్సింది ఏమీ లేదు. నా స్నేహితుడు డా.గురవారెడ్డి సర్జరీ చేయనున్నారు'' అని ప్రకాశ్‌రాజ్‌ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. త్వరలో జరగబోయే 'మా' ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.


Next Story