మొదలైన ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ..!

Prabhas New Movie Shooting Started. రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తీస్తున్న భారీ ప్రాజెక్ట్ లో

By Medi Samrat  Published on  24 July 2021 10:21 AM GMT
మొదలైన ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ..!

రెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ తీస్తున్న భారీ ప్రాజెక్ట్ లో ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమాలో భారీ స్టార్ కాస్ట్ ఉంది. దీపిక పదుకోన్ ను హీరోయిన్ గా తీసుకోగా.. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఈ చిత్రం శ‌నివారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్‌లో సి.అశ్వినీద‌త్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన సెట్‌లో షూటింగ్ ప్రారంభ‌మైంది. అమితాబ్ బ‌చ్చన్ తొలి షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఆయ‌న‌పై స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించారు.

''ప్రత్యేకమైన గురు పూర్ణిమ రోజున సినిమా ప్రారంభమైంది. ఇండియన్ సినిమా గురువు అయిన అమితాబ్ బచ్చన్‌పై ప్ర‌భాస్ క్లాప్ కొట్టాడు'' అని నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది. ఈ సినిమాకు 'ప్రాజెక్ట్ కె' అనే ఆస‌క్తిక‌ర‌మైన వ‌ర్కింగ్ టైటిల్‌ను పెట్టారు. వైజయంతీ మూవీస్ ప్రెస్టీజియస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించనున్నారు. మహానటి సినిమా తర్వాత నాగ్ అశ్విన్ తీస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలను ఇప్పటికే లైన్ లో పెట్టేసిన ప్రభాస్.. ఈ సినిమా కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తూ ఉన్నారు.


Next Story
Share it