ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ.. సారీ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

Prabhas Nag Ashwin Movie Update. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ రెబల్‌ స్టార్‌

By Medi Samrat  Published on  17 Feb 2021 2:03 PM GMT
ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ.. సారీ చెప్పిన నాగ్‌ అశ్విన్‌

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. డైరెక్టర్‌ నాగ్‌ అశ్విన్‌ రెబల్‌ స్టార్‌ అభిమానులకు క్షమపణలు చెప్పారు. అసలు విషయం ఏంటంటే.. ప్రభాస్‌, మహానటి ఫేం నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

ఇందులో బాలీవుడ్‌ భామ దీపికా పదుకునే హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ సినిమా అప్‌డేట్ గురించి ఫ్యాన్స్‌ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి రోజున స్పెషల్‌ అప్‌డేట్‌ రాబోతోందని ముందుగా నాగ్‌ అశ్విన్‌ తెలుపగా, ఆ సమయానికి ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేదు. దీంతో అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్స్‌ చేస్తున్నారు. అప్‌డేట్‌ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

అభిమానుల ట్వీట్స్‌కు స్పందించిన నాగ్‌ అశ్విన్‌.. జనవరి 29న, ఫిబ్రవరి 26న రెండు అప్‌డేట్స్‌ రాబోతున్నాయని రిప్లై ఇచ్చారు. ఈ వార్తతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మొదటి అప్‌డేట్‌ ఫిబ్రవరి 26 కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంకో పది రోజుల్లో నాగ్ అశ్విన్‌, ప్రభాస్‌ సినిమా అప్‌డేట్‌ రాబోతోందని ఓ అభిమాని పెట్టిన ట్వీట్‌కు నాగ్ అశ్విన్‌ స్పందించాడు. తనను క్షమించాలని, ఈనెల 26న ఎలాంటి అప్‌డేట్‌ ఇవ్వలేమని, అది సరైన సమయం కాదంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు.

ఈ సినిమాను అశ్వనీదత్‌ రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తుండగా, మిక్కిజే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ప్రభాస్‌ కేజీఎఫ్‌ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో సలార్‌ మూవీ చేస్తున్నాడు. ఇదే కాకుండా ఓంరౌత్‌ దర్శకత్వంలో అదిపురుష్‌ సినిమా కూడా చేస్తున్నాడు. మరో వైపు ప్రభాస్‌, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్న రాధేశ్యామ్‌ షూటింగ్‌ చివరి దశలో ఉంది.
Next Story