ప్రాజెక్ట్ "కె" సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. రెండో షెడ్యూల్ లో వారితో సన్నివేశాలు

Prabhas joins the sets of Nag Ashwin’s Project K. ప్రభాస్, దీపికా పదుకోన్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' రెండవ షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో

By Medi Samrat  Published on  17 Feb 2022 4:21 PM IST
ప్రాజెక్ట్ కె సెట్స్ లో అడుగుపెట్టిన ప్రభాస్.. రెండో షెడ్యూల్ లో వారితో సన్నివేశాలు

ప్రభాస్, దీపికా పదుకోన్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ కె' రెండవ షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో ప్రారంభమవుతుందనే ప్రచారం కొనసాగింది. అనుకున్నట్లుగానే ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సెట్స్‌లో ప్రభాస్ జాయిన్ అయ్యాడు. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ కూడా ప్రస్తుత షెడ్యూల్‌లో భాగమవుతారని అందరూ భావిస్తూ ఉన్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, దీపికా మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ప్రాజెక్ట్ కె మొదటి షెడ్యూల్ కూడా హైదరాబాద్‌లో చిత్రీకరించబడింది. అయితే అది చాలా చిన్న షెడ్యూల్. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ లో భాగంగా నిర్మాతలు వైజయంతీ మూవీస్ దీపికా పదుకోన్ కు హృదయపూర్వక నోట్, హాంపర్‌తో స్వాగతం పలికారు.

ప్రభాస్ అభిమానులు రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రాధే శ్యామ్' కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించింది. రాధే శ్యామ్ మార్చి 11న విడుదల కానుంది. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ 'సలార్' ను కూడా ప్రభాస్ కంప్లీట్ చేయనున్నాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ కూడా నటిస్తోంది. ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆది పురుష్' సినిమాలో కూడా ప్రభాస్ చేస్తున్నాడు. ప్రభాస్-మారుతి కాంబినేషన్ లో కూడా ఓ సినిమా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


Next Story