వైరల్: అదిరిపోయే 'లుక్'లో పవన్ కళ్యాణ్..!

Pawan Kalyan Stunning Look. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు

By Medi Samrat  Published on  17 Dec 2020 11:29 AM GMT
వైరల్: అదిరిపోయే లుక్లో పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో బిజీగా ఉండడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తను నటిస్తున్న చిత్రం "వకీల్ సాబ్" గురించి మనకు తెలిసినదే.ఇప్పటికే ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణం వల్ల వాయిదా పడుతూ వచ్చింది.లాక్ డాన్ అనంతరం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ చివరి దశలో ఉంది.

పవన్ కళ్యాణ్ తన అన్న కూతురు నిహారిక పెళ్లి అనంతరం సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని కీలకమైన సన్నివేశాలను హైదరాబాద్ నగరంలోని నిజాం కాలేజీలో చిత్రీకరిస్తున్నారు.అయితే ఆ కాలేజీలో షూటింగ్ జరుగుతున్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున కాలేజ్ దగ్గరకు చేరుకున్నారు. తనను చూసేందుకు వచ్చిన అభిమానులకు అభివాదం చేయడంతోపాటు, కొంతమందికి సెల్ఫీ ఫోజులిచ్చారు.


అయితే ప్రస్తుతం వకీల్ సాబ్ సెట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలో పవన్ కళ్యాణ్ ఎంతో యంగ్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే ఈ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం తెలిపారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన తర్వాత మరి కొన్ని సినిమాలలో పవర్ స్టార్ ఎంతో బిజీగా గడుపనున్నారు. ఇంతకాలం తమ అభిమాన నటుడు సినిమాలు రాకపోవడంతో ఎంతో నిరాశకు గురైన అభిమానులకు త్వరలోనే వకీల్ సాబ్ సినిమా విడుదల అవుతుందని తెలియడంతో పవర్ స్టార్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.


Next Story