పవన్ కళ్యాణ్ అభిమానులు.. రెడీగా ఉండండి

Pawan Kalyan New Movie Update. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ ఉన్నారు. ఆయన అభిమానులు

By Medi Samrat  Published on  13 Aug 2021 12:28 PM GMT
పవన్ కళ్యాణ్ అభిమానులు.. రెడీగా ఉండండి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతూ ఉన్నారు. ఆయన అభిమానులు కూడా పవన్ సినిమా అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు. తాజాగా అభిమానులకు ఆనందాన్ని అందించే ఓ న్యూస్ బయటకు వచ్చింది. పవన్, రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో వస్తున్న చిత్రం టైటిల్ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఆగస్టు 15 ఉదయం 9.45 గంటలకు చిత్రబృందం టైటిల్, ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేయనుంది. ఆగస్టు 15న పవర్ తుపాను రానుందని.. సిద్ధంగా ఉండాలని చిత్ర యూనిట్ పేర్కొంది. చిత్రబృందం పంచుకున్న అప్ డేట్ లో పవన్ కళ్యాణ్ లుంగీతో కనిపిస్తూ ఉన్నాడు.

మలయాళంలో హిట్టయిన 'అయ్యప్పనుమ్ కోషియమ్' చిత్రాన్ని తెలుగులో పవన్, రానా ప్రధాన పాత్రలతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ అనే పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర పోషిస్తున్నారు. పవన్ కు జోడీగా నిత్యామీనన్ నటిస్తోంది. సితార ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల విడుదలైన మేకింగ్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు' సినిమాలో నటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే.. ఆ సినిమా సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.


Next Story