విమానాశ్రయంలో పవన్ క‌ళ్యాణ్ చిన్న కుమారై.. ఫోటోలు వైర‌ల్‌

Pawan Kalyan Daughter Photos Viral In Social Media. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంబంధించిన ఏ చిన్న విష‌యం అయినా

By Medi Samrat  Published on  18 Dec 2020 6:13 AM GMT
విమానాశ్రయంలో పవన్ క‌ళ్యాణ్ చిన్న కుమారై.. ఫోటోలు వైర‌ల్‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు సంబంధించిన ఏ చిన్న విష‌యం అయినా కూడా అభిమానుల‌కు పండ‌గే. మొన్ననే నిహారిక కొణిదెల వివాహంలో పవన్ తన వారసులు అకీరా నందన్ - ఆద్యలతో సందడి చేశారు. ఇంతలోనే ఇదిగో ఇలా సడెన్ గా ప‌వ‌న్ భార్య అన్నాలెజినోవా ఆమె పిల్లలు హైదరాబాద్ విమానాశ్రయంలో కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైరల్ గా మారాయి.
చాలా రోజుల తర్వాత అన్నాలెజినోవా కెమెరా కంటికి చిక్కారు. అన్నాలెజినోవా ఫోటోలు ఇంతగా ట్రెండ్‌ అవ్వడానికి ఆమె లుక్‌యే కారణం. ఇప్పటి వరకు సాంప్రదాయబద్దంగా చీరకట్టులో కనిపించిన ఆమె తాజాగా జీన్స్‌, టీషర్టులో ట్రెండీగా కనిపించారు. వేషాధారణలో ఇంతగా మార్పు రావడంతో అభిమానులు గుర్తుపట్టలేకపోతున్నారు. ఆమె వెంట కొడుకు మార్క్‌ శంకర్ పవనోవిచ్‌‌, కూతురు పొలెనా అంజనా పవనోవా కూడా ఉన్నారు. వీరిద్ద‌రు ముఖానికి మాస్కులు ధరించి ఉన్నారు.

ఇటీవ‌లే త‌న త‌ల్లితో క‌లిసి ర‌ష్యాకు వెళ్లిన వీరిద్ద‌రూ.. తాజాగా న‌గ‌రానికి వ‌చ్చారు. దీంతో ఎయిర్‌పోర్టులో అన్నాలెజినోవా పాటు అంజ‌నా ప‌వ‌నోవా, మార్క్ శంక‌ర్‌ను చూసిన ప‌లువ‌రు ఫోటోలు తీసి సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. అంజ‌నా ప‌వ‌నోవా.. అచ్చం త‌న తండ్రిలాగానే సింపుల్‌గా ఉందంటూ నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు.


Next Story