నితిన్ 'మ్యాస్ట్రో' ట్రైలర్ రిలీజ్.. దింపేశారుగా..!

Nithin Maestro Trailer. బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డార్క్ కామెడీ సినిమాల్లో 'అంధాదున్' సినిమా ఒకటి

By Medi Samrat  Published on  23 Aug 2021 1:54 PM GMT
నితిన్ మ్యాస్ట్రో ట్రైలర్ రిలీజ్.. దింపేశారుగా..!

బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ డార్క్ కామెడీ సినిమాల్లో 'అంధాదున్' సినిమా ఒకటి. ఈ సినిమా తెలుగులో 'మ్యాస్ట్రో' రీమేక్ చేస్తున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుండి ఎన్నో అనుమానాలు.. తెలుగులో సరిగా హ్యాండిల్ చేస్తారా.. లేదా అని.. అయితే ఈరోజు విడుదలైన ట్రైలర్ ను చూస్తే.. పెద్దగా ఎటువంటి మార్పులు చేయకుండా రీమేక్ చేసినట్లు తెలుస్తోంది. నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం 'మ్యాస్ట్రో'. ప్రముఖ నాయిక తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది.


నభా నటేశ్‌, తమన్నా తమ అందంతో, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ముఖ్యంగా నితిన్, తమన్నా భాటియాల మధ్య జరిగే సన్నివేశాలు మరింత ఆసక్తిని కలిగిస్తున్నాయి. 'సినిమాల్లోనే మర్డర్ చూసి భయపడే నేను.. ఇప్పుడు నిజంగా మర్డర్ చేయాల్సి వచ్చింది' అంటూ తమన్నా చెప్పిన డైలాగ్ వీక్షకులను ఆకట్టుకుంది. క్రైమ్‌ సన్నివేశాలు ఉత్కంఠగా సాగాయి. మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.


Next Story