భీమ్లా నాయక్ నుంచి బిగ్ అప్డేట్

New Update From Bheemla Nayak. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న‌ మ‌ల్టీస్టార‌ర్‌ చిత్రం భీమ్లా నాయక్.

By Medi Samrat  Published on  30 Aug 2021 8:41 PM IST
భీమ్లా నాయక్ నుంచి బిగ్ అప్డేట్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌-ద‌గ్గుబాటి రానా న‌టిస్తున్న‌ మ‌ల్టీస్టార‌ర్‌ చిత్రం భీమ్లా నాయక్. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవ‌ల ప‌స్ట్ గ్లిమ్సీ, భీమ్లా నాయ‌క్ ఇన్ బ్రేక్‌ టైం వంటి అప్‌డేట్‌లు రిలీజ్ చేయ‌గా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేసాయి. తాజాగా మ‌రో అప్‌డేట్‌ని ఇచ్చింది చిత్ర‌యూనిట్‌. సెప్టెంబ‌ర్ 2వ తేదీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ పుట్టిన‌రోజును పుర‌స్క‌రించుకుని ఓ స‌ర్‌ప్రైజ్ ప్లాన్ చేసింది. భీమ్లా నాయక్‌ సినిమా నుండి ప‌స్ట్ సింగిల్ ను ఆ రోజు ఉద‌యం 11:16 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే ను ప‌వ‌ర్ పుల్ సాంగ్‌తో సెల‌బ్రేట్ చేసుకుందామ‌ని యూనిట్ పేర్కొంది.

పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, బీజుమేన‌న్ ప్ర‌ధాన పాత్ర‌లుగా మ‌లయాళంలో సూప‌ర్ హిట్ అందుకున్న‌ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. బీజుమేన‌న్ పోషించిన పాత్ర‌ను ప‌వ‌ర్ స్టార్ చేస్తున్నారు. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నిత్యామీనన్ కథానాయికగా నటిస్తోంది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై నాగ‌వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త‌మ‌న్ స్వరాలు అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


Next Story