మ‌ద్యం గ్లాసుతో పాయ‌ల్‌.. ఏకీపారేస్తున్న నెటీజ‌న్లు

Netizens Fire On Payal Rajputh. సినిమాల్లో న‌టించే వ‌చ్చే పారితోషికం కంటే.. ఓ కంపెనీ యాడ్ షూట్‌లో పాల్గొని దాన్ని

By Medi Samrat  Published on  13 Nov 2020 1:44 PM IST
మ‌ద్యం గ్లాసుతో పాయ‌ల్‌.. ఏకీపారేస్తున్న నెటీజ‌న్లు

సినిమాల్లో న‌టించే వ‌చ్చే పారితోషికం కంటే.. ఓ కంపెనీ యాడ్ షూట్‌లో పాల్గొని దాన్ని ప్ర‌యోట్ చేస్తే వ‌చ్చే పారితోషికం అధికంగా ఉంటుంది. సినిమా కోసం మూడు నెల‌లు కేటాయిస్తే.. ఇక్క‌డ మాత్రం ఒక్క రోజు చేస్తేనే స‌రిపోతుంది. ఇక మాకు డ‌బ్బే ముఖ్యం అంటున్నారు కొంద‌రు న‌టీన‌టులు. మ‌ద్యం సేవించ‌డం, సిగ‌రెట్ తాగ‌డం వంటివి హాని కార‌కం అని.. ఆ స‌న్నివేశాలు వ‌చ్చేట‌ప్పుడు కింద వేయ‌డం చూస్తుంటేనే ఉంటాం. ఎందుకంటే.. త‌మ అభిమాన న‌టీన‌టులు చేసే ప‌నులు వారి అభిమానులు అనుస‌రించి వారి జీవితాలు నాశ‌నం చేసుకోకూడ‌ద‌ని. సెన్సార్ కూడా దీనికి మ‌రో కార‌ణం. అయితే.. సినీ తార‌లు మాత్రం మాకేంటీ అన్న‌ట్లుగా సోష‌ల్ మీడియాలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు హీరోయిన్స్ విస్కీ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ పర్సనల్ ఫొటోల మాదిరిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమద్య హీరోయిన్ పూజా హెగ్డే తన తండ్రితో కలిసి రెడ్ లెబుల్ విస్కీ బ్రాండ్ కు ఫొటో ఫోజ్ ఇచ్చింది. తాజాగా ఆ జాబితాలో పాయ‌ల్ రాజ్‌పుత్ చేరిపోయింది.

'ఆర్ ఎక్స్ 100 చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది పాయ‌ల్ రాజ్‌పుత్‌. ప్ర‌స్తుతం ఆమె సోష‌ల్ మీడియాలో మ‌ద్యం బ్రాండ్‌ను ప్ర‌మోట్ చేస్తున్న పిక్ సోషల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. చేతిలో మందు గ్లాస్ పట్టుకుని, దాన్ని మైకంగా చూస్తూ, ముందే ఫుల్ బాటిల్ ను పెట్టుకుని కూర్చున్న పాయల్, తన పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేయగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇలాంటి పబ్లిసిటీ ఎంత వరకు కరెక్ట్ అంటూ నెటిజన్స్ పాయల్ ను విమర్శిస్తున్నారు. హీరోయిన్ గా బోల్డ్ పాత్రలకు పెట్టింది పేరు అయిన పాయల్ ఇలా ప్రమోషన్ కోసం అడ్డదారి అనుసరించడం ఎంత వరకు కరెక్ట్ అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.




Next Story