అద్భుతం : బాలకృష్ణ 'అఖండ' ట్రైలర్

Nandamuri Balakrishna Akhanda Trailer Released. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం

By Medi Samrat  Published on  14 Nov 2021 2:46 PM GMT
అద్భుతం : బాలకృష్ణ అఖండ ట్రైలర్

నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్‌ చిత్రం 'అఖండ'. గ‌తంలో వీరి క‌ల‌యిక‌లో సింహా, లెజెండ్‌ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ హిట్స్‌ తర్వాత వ‌స్తున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. కొద్దిసేప‌టి క్రితం 'అఖండ' సినిమా ట్రైల‌ర్ రిలీజైంది. విధికి, విధాత‌కు, విశ్వానికి స‌వాళ్లు విస‌ర‌కూడ‌దు అన్న డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌లైంది. అంచ‌నా వేయ‌డానికి నువ్వేమైనా పోల‌వ‌రం డ్యామా? ప‌ట్టిసీమ తూమా? పిల్ల‌కాలువ అని బాల‌య్య చెప్పిన డైలాగ్ ఆక‌ట్టుకుంది.


ఆశ చ‌చ్చిపోయిన‌ప్పుడు, న‌మ్మ‌కానికి చోటు లేన‌ప్పుడు, విధ్వంస శ‌క్తులు విరుచుకుప‌డిన‌ప్పుడు అఖండ వ‌స్తాడు.. కాపాడ‌తాడు అంటూ బాల‌య్య మ‌రో పాత్ర ప‌వ‌ర్ గురించి వివ‌రించారు. జగపతిబాబు, శ్రీకాంత్ ల పాత్ర‌లు కూడా రివీల్ చేశారు. మొత్తంగా ట్రైల‌ర్ సోష‌ల్ మీడియాలో దూసుకుపోతూ.. సినిమాపై ఉన్న‌ అంచ‌నాలను మ‌రింత పెంచాయి. ఇదిలావుంటే.. ద్వారకా క్రియేషన్స్‌ బ్యానర్‌పై మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలొ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా, జగపతిబాబు, శ్రీకాంత్‌, పూర్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నాడు.


Next Story
Share it