డాన్సర్ గా ముమైత్ ఖాన్ మొదటి పారితోషికం తెలిస్తే..
Mumaith Khan First Remuneration As A Dancer. సినీ యాక్టర్ ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు తెలుగు
By Medi Samrat Published on 26 Feb 2021 1:09 PM ISTసినీ యాక్టర్ ముమైత్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పలు తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చేసి మంచి ఐటమ్ గర్ల్ గా మంచి గుర్తింపుని సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా "పోకిరి" లో "ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే.. చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్లే.." అంటూ ఆ చిత్రంలో ముమైత్ డాన్స్ చేస్తూ కుర్రకారు గుండెల్లో కుంపట్లు రాజేసింది. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఐటమ్ సాంగ్స్ ను వేరే లెవెల్ కి తీసుకెళ్ళింది ఆ పాట. ఇక పోకిరి సినిమాతో టాలీవుడ్ మేకర్స్‌కి హాట్ ఫేవరేట్‌గా మారిపోయింది ముమైత్ ఖాన్. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా స్టార్ స్టేటస్‌ని సొంతం చేసుకున్న ముమైత్ తొలి పారితోషికం ఎంతో తీసుకుందో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు.
ముమైత్ ఖాన్ తన జీవితంలో చాలా ఇబ్బందుల్ని, ఆటు పోటల్ని ఎదుర్కుందట.ఈ స్థాయికి చేరడం వెనక ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొందట. ఇదే విషయాన్ని ఆలీతో సరదాగా కార్యక్రమంలో వెల్లడించింది. 13 ఏళ్ల వయసులోనే తాను సైడ్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించానని, అమ్మ మాత్రం ఎలాంటి డ్యాన్స్ షోలకు వెళ్లొద్దని కరాకండీగా చెప్పేదని అయితే డబ్బుల కోసం అమ్మకు తెలియకుండా డ్యాన్సర్‌గా పాల్గొనే దాన్నని చెప్పింది ముమైత్.
ఇక డాన్సర్ గా 17 ఏళ్ల వయసులోనే `మున్నా భాయ్` సినిమాతో తన కెరీర్‌ని ప్రారంభించానని అంతకు ముందు ఓ డ్యాన్స్ షో కోసం అమ్మని బలవంతంగా ఒప్పించి డబ్బుల కోసం వెళ్లానని, డ్యాన్సర్‌గా తాను అందుకున్న మొదటి పారితోషికం అక్షరాలా 750 రూపాయలని, ఆ తరువాత "మున్నాభాయ్" సినిమా కోసం ఓ పాటలో నటించినందుకు గానూ 30 వేలిచ్చారని అది చూసి అవకాశం ఇచ్చిన...దానికంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినందుకే ఎక్కువగా సంతోషించానని చెప్పుకొచ్చింది.ఇలా తన కెరీర్ లో ఎన్నో సమస్యలు ఎదుర్కొందట ముమైత్ ఖాన్.