శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణం కస్పావీధికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ ముగడ జగదీష్.. మెగాస్టార్ చిరంజీవిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. తనలో నిక్షిప్తమైన ప్రతిభతో 2.380 మిల్లీ గ్రాముల వెండి కాయిన్ పై చిరంజీవి ప్రతి రూపాన్ని చెక్కి తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. దీనిని తయారుచేయటానికి సుమారుగా 30 నిముషాల సమయం పట్టినట్లు ఆయన తెలిపారు.
అంతర్జాతీయ చిరంజీవి ఫెడరేషన్ ఏర్పాటు దినోత్సవం(ఏసీఎఫ్) సందర్భంగా ఈ కాయిన్ తయారు చేసినట్లు పేర్కొన్నారు. ఏసీఎఫ్ వ్యవస్థాపకుడు రాజుపాలెం శ్రీనివాసులు వెండి కాయిన్ పై చిరంజీవి చిత్రాన్ని చెక్కడం పట్ల జగదీష్‌కు అభినందనలు తెలిపారు. దీనిని చిరంజీవికి బహుమతిగా పంపనున్నట్లు జగదీష్ తెలిపాడు.