మోహన్ బాబును టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు

Mohan Babu Complaint Against Netizens. సోషల్ మీడియాలో కొందరు సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిన ఘటనలు గతంలో చాలా జరిగాయి.

By Medi Samrat
Published on : 10 July 2021 6:12 PM IST

మోహన్ బాబును టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు

సోషల్ మీడియాలో కొందరు సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టిన ఘటనలు గతంలో చాలా జరిగాయి. అయితే కొందరు సెలెబ్రిటీలు చూసి చూడనట్లుగా వ్యవహరించగా.. ఇంకొందరు మాత్రం తమను టార్గెట్ చేసిన వారిని జైలు పాలు చేశారు. ఇటీవలి కాలంలో కొందరు టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. కించపరిచేలా చేయడం వంటివి చేశారు. టాలీవుడ్ విలక్షణ నటుడు మోహన్ బాబు సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు.

యూట్యూబ్‌లో మోహన్‌బాబు‌ను కొందరు టార్గెట్ చేసి మరీ ట్రోలింగ్ చేస్తున్నారని ఆయన లీగల్ అడ్వైజర్ సైబర్ క్రైమ్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో మోహన్ బాబుపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని.. అసభ్యకరమైన బూతులు కామెంట్స్ రూపంలో పెడుతున్నారని పేర్కొన్నారు. పొలిటికల్ మోజో అనే పేరు గల యూట్యూబ్ ఛానెల్ మోహన్ బాబును వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా బూతులు తిడుతూ వీడియోల రూపంలో పోస్ట్ చేస్తున్నారంటూ ఆయన లీగల్ అడ్వైజర్ సంజయ్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Next Story