అయ్యో ఎంత క‌ష్టం.. టీకా వేయించుకుంటూ వ‌ణికిపోయిన మెహ‌రీన్

Mehreen Vaccination Shot Photos Goes Viral. మెహ‌రీన్.. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

By Medi Samrat  Published on  1 July 2021 2:37 PM IST
అయ్యో ఎంత క‌ష్టం.. టీకా వేయించుకుంటూ వ‌ణికిపోయిన మెహ‌రీన్

మెహ‌రీన్.. కృష్ణ‌గాడి వీర ప్రేమ‌గాథ చిత్రంతో తెలుగు చిత్ర‌సీమ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత అనేక హిట్ చిత్రాల‌లో న‌టించింది ఈ ముద్దుగుమ్మ‌. మొద‌ట్లో మంచి స‌క్సెస్‌లు అందుకున్న‌ మెహ‌రీన్‌కి రాను రాను స‌క్సెస్ రేటు కూడా త‌గ్గింది. అయితే.. ఎఫ్-2 చిత్రంతో మంచి హిట్ కొట్టిన మెహ్రీన్.. ప్ర‌స్తుతం ఎఫ్-3 చిత్రంలో న‌టిస్తుంది. అలాగే.. మారుతి దాసరి, సంతోష్ శోభ‌న్‌ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న చిత్రంలో కూడా న‌టిస్తూ బిజీగా ఉంది.

అయితే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మెహ్రీన్.. తాజాగా త‌న‌తో పాటు త‌న స్టాఫ్ అందరూ వ్యాక్సిన్ వేయించుకున్న ఫొటోలు ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో షేర్ చేసింది. అయితే.. స్టాప్ అంద‌రూ టీకా బాగానే వేయించుకోగా.. ఈ మెహ్రీన్ మాత్రం భ‌యంతో బిగ‌ప‌ట్టుకు కూర్చుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. అయితే.. చిన్న‌ప్ప‌టి నుండి త‌న‌కు ఇంజెక్ష‌న్ అంటే చాలా భ‌యం అని.. అందుకే అలా ఎక్స్‌ప్రెష‌న్స్ ఇచ్చాన‌ని రాసుకొచ్చింది మెహ‌రీన్. అలాగే.. అందరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని.. దీన్ని నేషనల్ డ్యూటీగా భావించి చేయాలని మెహరీన్ పేర్కొంది. ఇదిలావుంటే.. మెహ్రీన్ త్వ‌ర‌లో హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌ని వివాహం చేసుకోనుంది.


Next Story