మహేష్ కు ఆయనంటే ఎంతో అభిమానం, గౌరవం.. అందుకే..

Mahesh Tweet on Makeup Man. సూపర్ స్టార్ మహేష్ బాబు తన సన్నిహితులను, తనతో కలిసి పని చేసే వారిని, తనకు సహాయకులుగా

By Medi Samrat  Published on  8 July 2021 3:05 PM IST
మహేష్ కు ఆయనంటే ఎంతో అభిమానం, గౌరవం.. అందుకే..

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సన్నిహితులను, తనతో కలిసి పని చేసే వారిని, తనకు సహాయకులుగా ఉన్న వారిని ఎంతో బాగా చూసుకుంటారని తెలిసిందే..! ముఖ్యంగా మహేష్ బాబు మేకప్ మ్యాన్‌ పట్టాభి అన్నా.. ఆయన కుటుంబమన్నా మహేశ్ చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. గతంలో కూడా మహేష్ బాబు పట్టాభిపై ప్రేమను అందరితో పంచుకున్నారు. మరోసారి కూడా పట్టాభి తన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అని మహేష్ బాబు చెప్పుకొచ్చాడు.

మహేశ్ బాబు తన మేకప్ మ్యాన్ పట్టాభికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లలో "నాకు తెలిసినంతవరకు అత్యుత్తమ మేకప్ మ్యాన్ అంటే పట్టాభి. ఆయన సంతోషకర రీతిలో జన్మదినాన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. మున్ముందు కూడా ఆయన తన వృత్తిలో మరింత రాణించాలని కోరుకుంటున్నాను. ఆయనపై ఎప్పటికీ ప్రేమాభిమానాలు నిలిచే ఉంటాయి" అని పోస్టు పెట్టాడు. మహేశ్ బాబు తో పట్టాభి అనుబంధం గత 27 ఏళ్లుగా కొనసాగుతోంది. పట్టాభి లేకుండా తాను కెమెరాను ఫేస్ చేయలేను అని మహేశ్ గతంలో చాలా సార్లు తెలిపాడు. పట్టాభి కుటుంబాన్ని తన కుటుంబం అని కూడా మహేష్ బాబు ప్రస్తావించాడు.


Next Story