'మా' ఎన్నికల తేదీ ఖరారు.. హోరెత్తనున్న ప్రచారం
MAA Elections Date Confirmed. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో గత కొన్ని
By Medi Samrat Published on 25 Aug 2021 6:40 PM ISTమూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికైతే అధ్యక్ష బరిలో ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, హేమ, సీవీఎల్ నరసింహారావు ఉన్నారు. తాజాగా మా అసోసియేషన్ ఎన్నికల తేదీ ఖరారయింది. ఎన్నికలను అక్టోబర్ 10న నిర్వహించనున్నట్టు అసోసియేషన్ క్రమశిక్షణ కమిటీ ప్రకటించింది. నామినేషన్ల ఆఖరు తేదీ నాటికి ఇంకా ఎవరైనా పోటీ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. 'మా' శాశ్వత భవన నిర్మాణమే ప్రధాన అజెండాగా ఈసారి ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల తేదీ వెలువడిన నేపథ్యంలో ప్రచారపర్వం ప్రారంభం కానుంది. అభ్యర్థులు, వారి ప్యానల్స్ సభ్యులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.
మంచు విష్ణు ఇటీవల మాట్లాడుతూ, ఏకగ్రీవ ఎన్నికలకు అందరూ అంగీకరిస్తే... తాను కూడా సిద్ధమేనని ప్రకటించారు. ఇక తన తమ్ముడు, సినీ నటుడు మంచు మనోజ్‌తో తనకు గొడవలు ఉన్నాయంటూ జరుగుతోన్న ప్రచారంపై మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశాడు. వ్యక్తిగత విషయాల గురించి ఇతరులు ఎందుకు చర్చించుకుంటారంటూ నిలదీశాడు. తన అక్క మంచు లక్ష్మి తమతో కాకుండా వేరుగా ఉంటుందని, అలాగే మంచు మనోజ్ కూడా వేరుగానే ఉంటాడని విష్ణు వివరించాడు. తాను తన తండ్రి మోహన్ బాబుతో ఉంటున్నానని తెలిపాడు. అంతేగానీ, తమపై వస్తోన్న అసత్య ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు.