'ఉస్తాద్ భగత్ సింగ్'పై కీలక అప్డేట్

మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటి. 'మత్తు వదలారా 2' విడుదలకు సిద్ధమవుతోంది

By Medi Samrat
Published on : 30 Aug 2024 8:45 PM IST

ఉస్తాద్ భగత్ సింగ్పై కీలక అప్డేట్

మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం టాలీవుడ్‌లో అతిపెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటి. 'మత్తు వదలారా 2' విడుదలకు సిద్ధమవుతోంది. టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రెస్ మీట్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు తమ తదుపరి చిత్రాలకు సంబంధించిన అప్‌డేట్‌లను వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఆగిపోతుందని కూడా పుకార్లు వచ్చాయని.. చిత్రం ఆగిపోయే ప్రసక్తే లేదని అన్నారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొలిటిక‌ల్ క‌మిట్మెంట్స్ కార‌ణంగా ఈ సినిమా ఆలస్యమైంది. కొద్ది రోజులలో షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుందని, 2025 ప్రారంభంలో కల్లా షూటింగ్ మొత్తం పూర్తవుతుందని నిర్మాతలు తెలిపారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ చిత్రం నుండి ఒక అప్డేట్ ను విడుదల చేయడానికి టీమ్ ప్లాన్ చేస్తోంది. త్వరలో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కి హాజరు కానున్నారు. రీసెంట్ గా మిస్టర్ బచ్చన్ సినిమాతో పెద్ద పరాజయాన్ని చవిచూసిన దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాతో మళ్లీ పెద్ద హిట్ కొట్టాలని భావిస్తున్నారు.

Next Story