మహేష్ బాబు.. కేటీఆర్ ఫ్రెండ్షిప్.. మరోసారి ట్వీట్ వైరల్..!

KTR Wishes To Mahesh Babu. సూపర్ స్టార్ మహేష్ బాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు

By Medi Samrat  Published on  9 Aug 2021 12:20 PM IST
మహేష్ బాబు.. కేటీఆర్ ఫ్రెండ్షిప్.. మరోసారి ట్వీట్ వైరల్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో వారి బాండింగ్ బయట పడింది. మహేష్ బాబు రొటీన్ సినిమా తీస్తే తనకు అసలు నచ్చదని.. తిట్టేశాను కూడా అని కేటీఆర్ సభా ముఖంగా చెప్పుకొచ్చారు. భరత్ అనే నేను సినిమా సమయంలో కేటీఆర్‌‌‌‌తో మహేష్, కొరటాల శివ కలిసి ఓ ఇంటర్వ్యూ కూడా చేశారు. ఇక ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో కేటీఆర్ మహేష్ బాబుకు స్పెషల్ మెసేజీని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ట్విట్టర్ వేదికగా ఆయన మహేష్ బాబుకు విషెస్ తెలిపారు. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు నాకు తెలిసిన నైసెస్ట్ సూపర్ స్టార్. మీరు ఎప్పటికీ యంగే.. ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలి డియర్ బ్రదర్'అంటూ రాసుకొచ్చారు కేటీఆర్.

ఎవర్ గ్రీన్ అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. స్టైల్, టాలెంట్‌ మేలవించిన ఆయుధం లాంటి నటుడు. బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ఈ సంవత్సరాన్ని గొప్పగా సాగించాలి. ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

వెండితెరపైనే కాదు.. వాస్తవ జీవితంలో కూడా మీరు నాకు స్పూర్తి. నా అమేజింగ్ సహ నటుడు, అందగాడుకి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఉన్నట్టే మీ బర్త్ డే కూడా అమేజింగ్‌గా ఉండాలి మహేష్ బాబు సార్ అంటూ కీర్తీ సురేష్ ట్వీట్ చేశారు. పలువురు ప్రముఖులు మహేష్ బాబుకు సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారు. మరో వైపు 'సర్కారు వారి పాట' సినిమా టీజర్ రికార్డుల వ్యూస్ ను సొంతం చేసుకుంటూ ఉంది.


Next Story