బేబమ్మకు బర్త్ డే విషెష్.. పలు క్రేజీ ప్రాజెక్టుల్లో..!

Krithi Shetty Up Coming Projects. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. టాలీవుడ్‌లో ఇంత తక్కువ

By Medi Samrat  Published on  21 Sep 2021 1:41 PM GMT
బేబమ్మకు బర్త్ డే విషెష్.. పలు క్రేజీ ప్రాజెక్టుల్లో..!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది కృతి శెట్టి. టాలీవుడ్‌లో ఇంత తక్కువ కాలంలో ఇంత ఫాలోయింగ్‌ సాధించిన కృతి వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. కృతి శెట్టి పుట్టినరోజు సందర్బంగా ఆమెకు సోషల్‌ మీడియాలో శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది. ఇక ఆమె నటిస్తున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్స్ కూడా ఈరోజు విడుదలయ్యాయి. నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో నటిస్తున్న కృతిశెట్టి.. ఎనర్జిటిక్ హీరో రామ్-లింగు స్వామి నటిస్తున్న సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది. 'బంగార్రాజు' సినిమాలో ఆమె నాగ చైతన్యకు జోడీగా కనిపించనుంది.

సుధీర్ బాబు సరసన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అనే మూవీ చేస్తోంది. ఈ రోజు కృతి శెట్టి బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఆమె సినిమాల‌కు సంబంధించిన లుక్స్ విడుద‌ల చేశారు మేకర్స్. కృతి శెట్టికి బ‌ర్త్ డే శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ విడుద‌లైన పోస్ట‌ర్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. కృతి ఇక నితిన్ జోడీగా 'మాచర్ల నియోజక వర్గం' సినిమాను కూడా చేస్తోంది. కృతి శెట్టి చిన్నప్పటి నుంచే పలు యాడ్స్‌లో నటిస్తూ వెళ్ళింది. ఐడియా, షాప్పర్స్ స్టాప్, పార్లే, లైఫ్ బాయ్, బ్లూ స్టార్ వంటి సంస్థల యాడ్స్ లో అలరించింది. హిందీలో 2019లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన 'సూపర్ 30' సినిమాలో విద్యార్థిగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ తరువాత "ఉప్పెన" ద్వారా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు భారీ పారితోషికంతో దూసుకుపోతోంది.


Next Story