ఆ కోపంతో బాల‌య్య నా ముఖంపై కాండ్రించి ఉమ్మేశాడు : కోట శ్రీనివాస రావు

Kota Srinivasa Rao About Balakrishna Behavior. కోట శ్రీనివాస రావు.. టాలీవుడ్ లెజెండరీ నటుడు..! ఎన్నో విలక్షణ పాత్రలు చేశారు. ఒకప్పుడు

By Medi Samrat  Published on  22 Aug 2021 3:04 PM IST
ఆ కోపంతో బాల‌య్య నా ముఖంపై కాండ్రించి ఉమ్మేశాడు : కోట శ్రీనివాస రావు

కోట శ్రీనివాస రావు.. టాలీవుడ్ లెజెండరీ నటుడు..! ఎన్నో విలక్షణ పాత్రలు చేశారు. ఒకప్పుడు విలనీ, కామెడీతో అలరించడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా చేశారు కోట శ్రీనివాసరావు. అయితే ఆయన కెరీర్ లో 'మండలాధీశుడు' సినిమాలో చేసిన పాత్ర మాత్రం ఎన్నో వివాదాలకు కారణమైంది. ఎందుకంటే ఆ సినిమాలో కోట శ్రీనివాస రావు ఏకంగా 'దివంగత నందమూరి తారకరామారావు' పాత్రను పోషించారు. ఆ సినిమా చూసిన తర్వాత తనను రామారావు అభిమానులు.. అలాగే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చాలా ద్వేషించే వారని కోట శ్రీనివాసరావు చెప్పారు.


ఒక రోజు ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా డబ్బింగ్ చెప్పేందుకు చెన్నైకి వస్తున్నారు అనే విషయం తనకు తెలిసిందని అదే సమయానికి తాను కూడా చెన్నై ఎయిర్ పోర్ట్ లో ఉన్నానని కోట శ్రీనివాసరావు అన్నారు. చెన్నై ఎయిర్ పోర్ట్ లో తన ముందు విజయ్ చందర్ లైన్ లో ఉండగా ఆయనకు తన బ్యాగ్ అప్పగించి నేరుగా ఎన్టీఆర్ వద్దకు వెళ్లి నమస్కారం చేశానని అన్నారు. తనను ముందు ఎన్టీఆర్ గుర్తుపట్టకపోయినా తర్వాత గుర్తుపట్టి మీరు చాలా బాగా నటిస్తున్నారు బ్రదర్ మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారని కోట శ్రీనివాసరావు గతంలోనే చెప్పారు.

అయితే ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ.. కోట శ్రీనివాస రావుతో వ్యవహరించిన విధానం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన కోట శ్రీనివాస రావు.. తన ముఖంపై బాలయ్య కాండ్రించి ఉమ్మేశాడని తెలిపారు. తాను రాజమండ్రి షూటింగ్ వెళ్లగా అక్కడ వేరే షూటింగ్ కోసం బాలకృష్ణ కూడా వచ్చారు.. ఇద్దరూ ఒకే చోట బస చేయగా ఆయన లిఫ్ట్ లో పై నుంచి కిందకు వస్తుండగా తాను కింద నుంచి పైకి వెళ్ళేందుకు లిఫ్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

అక్కడ వాళ్ళందరూ తప్పుకోండి తప్పుకోండి అంటున్నారని తనకు ముందు అర్థం కాలేదని ఆయన అన్నారు.. అయితే బాలకృష్ణ అందులోంచి దిగుతుండగా చూసి నమస్కారం పెట్టాను. అయితే నమస్కారం పెడితే ఆయన కాండ్రించి ముఖం మీద ఉమ్మేశాడని కోట శ్రీనివాసరావు చెప్పారు. ఒక ముఖ్యమంత్రి కొడుకు తన తండ్రిని తిడితే ఎలా ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తించాడు అని ఆయన అన్నారు. ఇప్పుడంటే తాను ఒక గొప్ప నటుడిని అని బాలకృష్ణ అంటున్నారని కానీ ఒకప్పుడు మాత్రం ఇలా ఆయన చేతిలో అవమానం పొందానని కోట శ్రీనివాసరావు బాధను వ్యక్తం చేశారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


Next Story