హైలైట్ అయిన చిరుతల షాట్ పై కొరటాల చెబుతోంది విన్నారా..?

Koratala Shiva Comments On Acharya Shooting. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం

By Medi Samrat  Published on  30 Nov 2021 4:32 PM IST
హైలైట్ అయిన చిరుతల షాట్ పై కొరటాల చెబుతోంది విన్నారా..?

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ హీరోలుగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఆచార్య'. ఇటీవల ఈ సినిమాలో సిద్ధ కు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. అందులో ఓ షాట్ కు మాత్రం తెగ పేరు వచ్చింది. ఈ టీజర్ లోని చివరి షాట్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఏటి ఒడ్డున చిరుత పిల్ల నీరు తాగుతూ ఉంటే.. దాని వెనుక తల్లి చిరుత కాపాలా కాస్తూండగా.. ఒడ్డుకు మరో వైపున రామ్ చరణ్ నీళ్ళు తాగుతుండగా.. చిరంజీవి వెనుక ఉండే ఈ షాట్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దర్శకుడిని తెగ పొగిడేస్తూ ఉన్నారు. సూపర్ ఎలివేషన్ అంటూ చెబుతున్నారు.

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ 'ఆచార్య'లో రామ్ చరణ్ కు సంబంధించి ఒక ఫ్లో లో ఆర్గానిక్ గా సన్నివేశాలు వెళతాయని, అలాంటి సీన్స్ లో ఇదీ ఒకటని కొరటాల తెలిపారు. అంతేకాకుండా ఈ సీన్ తీసేటప్పుడు దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందని అనుకున్నాం. అయితే టీజర్ విడుదలయ్యాకా మేం అనుకున్నదానికన్నా చాలా ఎక్కువ స్పందన లభించిందని కొరటాల తెలిపారు. కొణిదెల ప్రొడక్షన్ హౌస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తు్న్నారు. టీజర్, రెండు సింగిల్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి.


Next Story